Take a fresh look at your lifestyle.

యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ ‌పనుల బ్లాస్టింగ్‌ యువకుడు మృతి

Youth killed in blast of Yadadri power plant

దామరచర్లలోని యాద్రాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ ‌పనుల్లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్న అనే వ్యక్తి మృతి చెందాడు. రెండు రోజుల క్రితం బ్లాస్టింగ్‌ ‌పనుల్లో రాళ్లు తగలడంతో వెంకన్న(27) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవర్‌ ‌ప్లాంట్‌ ‌వద్ద బంధువులు ధర్నాకు దిగారు. ఈ నెల 4వ తేదీన దామరచర్ల యాద్రాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ పనుల బ్లాస్టింగ్‌ నిర్వహించారు. దీంతో రాళ్లన్నీ రోడ్డు ద పడిపోయాయి. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న బూర వెంకన్న(27) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్న గత రాత్రి మృతి చెందాడు. దీంతో వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలని పవర్‌ ‌ప్లాంట్‌ ‌వద్ద బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply