Take a fresh look at your lifestyle.

మానసిక ఆందోళనలో యువత

సీటు సాధించలేక విద్యార్థులు, ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు – డా.అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్టు (పునరావాస మనస్తత్వవేత్త) అసోసియేషన్‌ ఆఫ్‌ ‌రిహాబిలిటేషన్‌ ‌సైకాలజీస్టస్ అం‌డ్‌ ‌ప్రొఫెసనల్స్ ఇం‌డియా జాతీయ అధ్యక్షుడు 9703935321 ఒక వైపు కరోన విళయ తాండవం మరో వైపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతుల కల్పన ప్రస్తుత సమాజానికి ఒక సవాలే. ఐ.ఐ.టీ.లో సీటు సాధించలేక మనోజ్‌ ఆత్మహత్య, లాంగ్‌ ‌టర్మ్ ‌కోచింగ్‌ ‌తీసుకున్నప్పటికీ మెడిసిన్‌ ‌లో సీటు సాధించలేక రవళి డిప్రెషన్‌ ‌కు లోనైనా సంఘటనలు పత్రికలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం, సరైన సమయంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ‌లు రాక ఎప్పుడో ఒక్కసారి విడుదల ఐనా ఉద్యోగాల భర్తీకి పెరిగిన కాంపిటీషన్‌ ‌తో పోటీ పడలేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి చివరకు ఏజ్‌ ‌బార్‌ అయ్యి కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు పెరుగ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

మరోగ్రహాన్ని వెతుక్కోవాల్సిందేనా…..
ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డూ అదుపూ లేకుండా కాలం కంటే వేగంగా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజల అవసరాలు తీర్చే వనరులు జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా సమకూరడం లేదు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు అపరిమితంగా పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు లభించడం లేదు. ప్రజలు భూమికి భారమై, శాపంగా బ్రతుకును వెల్లదీస్తున్నారు. జానేడు కడుపు కోసమే, నెను గొప్పగా జీవించాలనే ఆలోచనతో ప్రజలలో ఒకరికి మరొకరి మధ్య వైషమ్యాలు పెరిగి రాష్ట్రాల మధ్య , దేశాల మధ్య జల యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవడాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందేనా.

విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలేవి:
జనాభా పెరుగుదల వలన ప్రతి విషయంలో పోటీ తత్వం విపరీతంగా పెరిగిపోతోంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవకాశాలు కల్పించక పోవడంతో యువతలో ఒత్తిడి రాజ్యమే లుతోంది. ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగం రాజ్యమేలుతోంది. ఆర్థిక మాంద్యం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. దేశంలో జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పనకు, అభివృద్దికి పొంతనలేదు. విద్యారంగంలో చూస్తే ఐ.ఐ.టీ., మెడిసిన్‌., ‌ఫార్మసీ., వ్యవసాయ రంగంలకు సంబంధించిన కోర్సులలో సీట్‌ ‌సంపాదించాలంటే చాలా కష్టంగా మారింది. పిల్లలు చదువులకు బానిసలుగా మారుతున్నారు. సీటు సాధించలేక పోయినపుడు కుంగుబాటుకు లోనవుతున్నారు. ఉద్యోగాలలో కూడా విపరీతమైన పోటీతత్వం పెరిగిపోతోంది. యువత మానసిక ఆందోళనలకు లోనవుతున్నారు.

విపరీత జనాభా పెరుగుదలకు కారణం ఎవరూ…….
జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివలన లాభ నష్టాలేమిటి? అసలు జనాభా అనేది దానికదే ఒక శాపమా? లేక వరమయ్యే అవకాశాలున్నాయా? దానిని అదుపు చేయడమా? స్థిరీకరించడమా?పెరుగుదల వేగాన్ని తగ్గించడమా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం గుర్తించాలి. ప్రపంచ జనాభాలో 40 శాతం ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరుగుతోంది.

దేశమంటే మట్టి కాదోయ్‌………`
‌దేశమంటే మనుషులోయ్‌……..
‌జనం జనం ప్రభంజనం ఇవీ ఒకప్పటి స్లోగాన్స్. ‌ప్రస్తుతం జనాభా ధరణీ పై భారంగా మారింది. ప్రస్తుత పరిస్తితులను చూస్తే ఈ భూమ్మీద 100 కోట్ల మందికి ఆహార దొరకడం ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. జనాభా పెరుగుదలతో ఇలాంటి కష్టాలు ఎన్నో కాలే కడుపులతో జీవనాన్ని వెల్లదీస్తున్న వారు మరెందరో…. ఈ సమస్యలకు ముగింపు పలికేదెప్పుడూ….. ఎన్నాల్లు ఇలాంటి బ్రతుకును బ్రతకాలి….. మానవ జాతి సాధించిన విజయాలతో మనిషి జీవిత ప్రమాణ కాలం పెరిగింది. అదు పులేని జనాభా, కుటు ంబంలో వంశో ద్దారకుడి కోసం ఇష్టా రీతిగా పిల్లలను కనడంతో జ నాభా విపరీ తంగా పెరిగి పోతోంది. ఆకలి మరణాలు, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతూంది. జనాభా పెరుగుదల సమస్యలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సన్నద్దం కావాలి. అవని పై కోట్ల జనాభా పెరిగిపోతుంది భూభారంగా మారిన జనాభా పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం పెరిగిపోతోంది. ప్రజలందరూ చేయి చేయి కలుపుదాం జనాభా పెరుగుదలను నియంత్రించుదాం. జనాభా నియంత్రణను సామాజిక భాద్యతగా గుర్తించాలి.

ప్రభుత్వ చర్యలేవి: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతి సెకనుకు 4.5 మంది ప్రపంచ భూమండలం పైకి వస్తున్నారు. ప్రతి 40 సంవత్సరాలకు జనాభా రెట్టింపయ్యే ప్రమాదం ఏర్పడనుంది. ప్రపంచంలోనే కుటుంబనియంత్రణ పథకాలను 1950లోనే అధికారికంగా ప్రవేశపెట్టిన భారతదేశం ఇప్పటికీ జనాభా నియంత్రణ సాధించలేకపోయింది. ప్రజలలో మూఢనమ్మకాలను వదిలే విధంగా కుల మతాలకు అతీతంగా గ్రామాగ్రామాన చైతన్య కార్యక్రమాల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే కష్ట నష్టాలను కళ్లకు కట్టినట్లుగా వివరించాలి. స్త్రీ విద్యా వంతురాలిని చేయాల్సిన భాద్యత ప్రతిఒక్కరి పైనా ఉంది. యువతరంలో వెలుగులు నింపే విధంగా కృషి చేయాలి. జనాభాను అదుపు చేసి, మానవ వనరులను సరైన పద్దతిలో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భూమాత భారాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. జనాభా నియంత్రణ మనందరి కర్తవ్యం. పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల పెరుగుదల, ఉద్యోగాలు, ప్రకృతి వనరులు పెరగడం లేదు. జనాభా పెరుగుదల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ప్రస్తుత జనాభా పెరుగుదల వలన ప్రజలలో చైతన్యం వచ్చినా సహజసిద్దంగా లభించే వనరులను ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారు.సహాజ వనరులు అంతరించిపోతున్నాయి.

అవకాశాలు సృష్టంచేలా ప్రభుత్వాలు కృషి చేయాలి: యువతలో మానసిక ఆందోళనలు, ఆకలితో అలమటిస్తున్న పిల్లల భవితవ్యం బంగారు మయం కావాలన్నా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా బాధ్యతగా గుర్తించాలి. గ్రామంలోని విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువకులు గ్రామ ప్రజలతో మమేకమయ్యి జనాభా నియంత్రణ పై చైతన్యం పరచాలి. కుటుంబనియంత్రణ పథకంను పకడ్భంధీగా నిర్వహించాలి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవకాశాలు సృష్టంచేలా ప్రభుత్వాలు కృషి చేయాలి.మనిషి తలచుకొంటే నల్లరాళ్లనే కాదు ఉక్కు పర్వతాలు సైతం ముక్కలు చెక్కలు అయి తీరాల్సిందే.సామాజిక చైతన్యంతో బంగారు భవితవ్యాన్ని సృష్టించుకొందాం. ఒత్తిడి రహిత జీవనాన్ని అనుభవిద్దాం. భవిష్యత్తు మూడు తరాలకు మనం నాందిగా నిలుద్దాం. జనాభా నియంత్రణలో అందరం భాగస్వాములవుదాం.

atla srinivas reddy
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
సైకాలజిస్టు, 9703935321

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!