తెలంగాణ వస్తే ఏ మోస్తది?
కొలువులు, నీళ్ళు, నిధులు!
ఆత్మగౌరవం, స్వయం పాలన!
గీసొంటి మాటలు చెప్పిండ్లు
లెక్కలతో సహా తేల్చేసిండ్లు
ఉద్యమాన్ని ఉరకలేయించిండ్లు
రాష్ట్ర మోచ్చాక ఎట్లున్నదంటరు?
మౌనం మెందుకు? ‘ఉన్నమాట’ చెప్పరా?
ఔను! మీ కెందుకు నోరు పెకులుతది
అప్పుడు మహా మహ మేధావులు
ఇప్పుడు సర్కారు గడ్డి తినే మేతావులు
సన్మాన శాలువాలో వొదిగిండ్లు
సంపాదన లౌక్యంలో ఎంతోఎదిగిండ్లు
బతికుండగానే మీకు పిట్టకు పెడుతన్నం!
వేగుచుక్కలకు ఆహ్వానం పలుకుతున్నం!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర