Take a fresh look at your lifestyle.

యువత, విద్యావంతులు, మేధావులు దేశ అభివృద్ధికై కృషి చేయాలి

నేటి యువత రేపటి తరానికి కొలమానం ఏ దేశ అభివృద్ధి అయినా యువ శక్తి పైనే ఆదారపడి ఉంటుంది ప్రభుత్వాలు కూడా యువ శక్తిపై పని చేస్తున్నాయి ప్రస్తుత సమయంలో యువత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతూ ఆల్కహాల్‌, ‌డ్రగ్స్, ‌గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు మత్తులో తూలుతూ వాహనాలపై పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తూ వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు హని కలిగిస్తున్నారు. యువత స్వేచ్ఛను కొరుకోవడంలో తప్పు లేదు అది మితిమీరితేనే అనేక అనర్థాలు జరుగుతాయి పిల్లల అవసరాలు తీర్చవలసిన భాద్యత తల్లిదండ్రులది కానీ వారిపై ప్రేమతో విలాసవంతమైన జీవితం కల్పించాలని ప్రయత్నించడం అది సబబు కాదు ప్రపంచ యువతలో భారత దేశ యువత కూడా అధికంగానే ఉంది ప్రంపంచ ప్రతి వంద మందిలో ఒక భారతీయుడు ఉన్నాడు మన దేశ సంపద యువతగా భావిస్తాం.

నేడు ప్రంపంచ దేశాలు అభివృద్ధిలో పోటీ పడి ముందుకు పోతున్న తరుణంలో భారత దేశం మాత్రం నేటికి అభివృద్ధి చెందుతున్న దేశం గానే చెప్పుకుంటున్నాము ఎందుకంటే మన యువత విద్యావంతులు, మేధావులు అధిక సంపాదనకై విదేశాలకు ప్రయాణము అవుతున్నారు ప్రపంచంలో పేరు పొందిన సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్నారు అది మనకు గౌరవమే కానీ మన దేశ అభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి కదా పుట్టి పెరిగిన దేశానికి మనం ఏం చేశాము అని ప్రతి ఒకరూ ఆత్మ పరిశీలన చేసుకొండి దేశం మన అందరింది భారతదేశాన్ని పుణ్య భూమిగా పేర్కోటాము, ఈ నేలపై స్వాతంత్య్ర సమరయోధుడు విద్యావంతులు మేధావులు పురాణాల్లో జరిపిన రాజుల పాలన, వివిధ వంశీయుల ఆచార వ్యవహారాలు, ఇతిహాసలు, మహా భారతం, రామాయణం వంటి మొదలయిన ఎన్నో గ్రంథాలు నీతిని బోదిస్తూ భారత దేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి అంటూ వంటి చరిత్ర తెలుసు కోవడానికి ప్రయత్నం చేసిన యువత సన్మార్గములో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని విశ్లేషకుల భావన మన దేశానికి ఉన్న శక్తి యువతగా చెప్పుకుంటారు వారి సేవలు నేడు దేశానికి ఎంతో అవసరం కావున ప్రభుత్వాలు కూడా యువత చెడు మార్గంలో వెళ్ళకుండా తగు చర్యలు తీసుకుని వారి వ్యక్తిత్వ వికాస నైపుణ్యానికి కృషి చేయాలని కోరుతూ తల్లిదండ్రులు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది భారత దేశానికి అందించవలసిన భాధ్యత తల్లి దండ్రులది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సాధిస్తే వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయవచ్చు దీని ద్వారా యువత పెడదారులు పట్టకుండా చూడవచ్చు. పెరిగిన శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకుని అభివృది చెందిన దేశాల యువకులు కొత్తగా ఒక వస్తువును తయారు చేయాలని నిరంతరము పరితపిస్తూ నూతన వస్త్రవులను కనిపెడుతూ ఆ దేశా అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఆ వస్తువులు మార్కెట్‌ ‌లోకి రావడంతో పోటీ పడి కొంటున్నారు మన యువత అదే వస్తువును మనం తయారు చేయాలేమా? మనకు ఎందుకు సాధ్యం కాదు ఒక సారి ఆలోచించండి ? ప్రయత్నం చేసినా ప్రతి ఒకరికి విజయం సిద్దించాలని లేదు ప్రయత్నిచడం మన బాధ్యతగా భావించాలి కానీ మన యువత ఇతర దేశాల వారు కనిపెట్టిన సోషల్‌ ‌మీడియాలో కాలయాపన చేస్తున్నారు. నేటి యువత ప్రజా సేవ చేయడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు ఎందుకంటే చిన్న నాటి నుండి చదువు చదువు అని తల్లి దండ్రులు వెంట పడుతూ సమాజానికి దూరంగా పెంచుతున్నారు సమాజ సేవకు ఎక్కడ అంకితం అయిపోతారో అని కానీ సమాజంలో జరిగే చిన్న చిన్న సంఘటనలకు భయపడుతూ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి లేక ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో రోజు మనం పేపర్‌, ‌న్యూస్‌ ‌చానల్‌ ‌లలో చూస్తూనే ఉన్నాము పిల్లలను సమాజం కోసం పెంచండి నాన్న పది మందికి అన్నం పెట్టాలి రా అని బొదించండి కనీసం పది మందికి కాకపోయినా మీకైనా అన్నం పెడుతాడు యువత భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉందని గమనించాలి, పెద్దలను గౌరవిస్తూ మంచి విద్యా బుద్ధులు నేర్పాలి తల్లి దండ్రుల సంపద పిల్లల ప్రవర్తన పైనే ఆదారపడి ఉంటుంది.

యువత నైపుణ్యం దేశానికే కాదు ప్రపంచానికి ఉపయోగ పడుతుంది యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసేందుకు వారిని ప్రోత్సహిస్తూ యువతకు స్కిల్‌ ‌డెవలప్మెంట్‌ ‌నేర్పడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. మరి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు యువతకు వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నైపుణ్య సదస్సులను పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మరికొంత మంది యువత తాము సంపాదించిన ఆదాయంలో కొంత సేవ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న వారు ఉన్నారు నేటి యువత ప్రపంచ ప్రగతికి దోహదపడుతుంది. 2000 సంవత్సరము నుంచి అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ఆగస్టు 12 న జరుపుకుంటారు ఇది కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది 2030 నాటికి సాంఘిక న్యాయం, శాంతి స్థాపన, విద్యను యువతకు అందించాలి, పర్యావరణ కాలుష్య గ్లోబల్‌ ‌వార్నింగ్‌ ‌వంటి సమస్యల పరిష్కారానికై స్థానిక, జాతీయ అంతర్జాతీయంగా యువతను ప్రభావితం చేసి వారిలో చైతన్యం నింపే విధంగా తయారు చేయాలి నూతన జాతీయ విద్యా విధానం కూడా యువత అభివృద్ధికి సహాయ పడుతుంది.

ప్రస్తుతం యువ శక్తిలో 96.8 శాతం అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం నైపుణ్యం లేకపోవడం ప్రస్తుతంలో కరోనా ద్వారా చాలా మంది యువత ఉపాధిని కోల్పోయారని పలు నివేదికలు తెలుపుతున్నాయి ప్రపంచంలో 15 – 24 మధ్య వయస్సు యువత దాదాపుగా 15.5 శాతంగా ఉన్నారు ఇదే సంఖ్య 2030 నాటికి 15.1 % తగ్గుతుందని 2050 సంవత్సరానికి 13.8 శాతానికి తగ్గుతుంది కానీ ఆఫ్రికా, ఆసియా ఖండంలో యువత జనాభా పెరుగుతుందని అంచనా ప్రపంచంలో నేడు ఇతర దేశాలపై అధిపత్యం కోసం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెంది యువత శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని ముందుకు పోతున్నాయి. ఏ దేశ అభివృద్ధి అయినా యువకులపై ఆదారపడి ఉంటుందని చైనా వంటి దేశాలలో చూశాము.
– మిద్దె సురేష్‌, ‌కవి, వ్యాసకర్త, 9701209355

Leave a Reply