Take a fresh look at your lifestyle.

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లు దారుణం

యువజన కాంగ్రెస్‌ ‌తాలూకా అధ్యక్షులు అజయ్‌ ‌యాదవ్‌
అచ్చంపేట,జూలై22,(ప్రజాతంత్ర విలేకరి): శాంతియుత నిరసనలు చేస్తుంటే అరెస్టులు చేయడం అన్యాయమని యువజన కాంగ్రెస్‌ ‌తాలూకా అధ్యక్షులు అజయ్‌ ‌యాదవ్‌ ‌ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో పాటు గోప్యతను బట్టబయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఫోన్‌ ‌ట్యాపింగ్‌లు చేయడం దారుణమన్నారు. ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో ఇటీవల నిరసన తెలియజేస్తే అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని పాలకులు హరిస్తుండటాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ,యువజన కాంగ్రెస్‌, ‌తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఇందిరా పార్కు వద్ద ఇవాళ జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని కోరారు. పెగాసస్‌ ‌వ్యవహారంలో భాగంగా ఏఐసీసీ ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా చలో రాజ్‌భవన్‌ ‌కార్యక్రమం నిర్వహించాలని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నిర్ణయించింది.

ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.కౌన్సిలర్లు గౌరీ శంకర్‌ ‌మాట్లాడుతూ ఇందిరాపార్కు వద్ద నిరసనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ముఖ్య నాయకులు బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.చలో రాజ్‌ ‌భవన్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు ప్రశ్నించే గొంతుల ఫోన్లు ట్యాప్‌ ‌పెగాసెస్‌ ‌తో కాంగ్రెస్‌ ‌నేతల ఫోన్‌ ‌లోకి చొరబాటు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న మోడీ సర్కార్‌ ‌కు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపుమేరకు ఛలో రాజ్‌ ‌భవన్‌ ‌దేరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్‌ ‌భవన్‌ ‌కార్యక్రమానికి బయలుదేర కుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు గోపాల్‌ ‌రెడ్డి, వై,శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ ‌హరిచంద్ర, మండల అధ్యక్షుడు వెంకట్‌ ‌రెడ్డి,యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి, వటవర్లపల్లి సర్పంచ్‌ ‌వి. చత్రునాయక్‌,‌కౌన్సిలర్లు బాబా, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు మహబూబ్‌ అలీ, ఖాదర్‌, ‌గౌస్‌ ‌బాష, బాలకృష్ణ ,నాగులు నాయక్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply