Take a fresh look at your lifestyle.

మద్యం, పొగాకుకు యువత బానిస..!

ప్రతి పది మంది యువకుల్లో ఒకరు
ఎన్‌సిడిఐఆర్‌ అధ్యయనం
భారతదేశ జనాభాలో కౌమారదశలో ఉన్న 21 శాతం ప్రజలు పొగాకు, మద్యపానం, అనియమిత ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవటం, ఊబకాయం వంటి కారణాల వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం కౌమారదశలో ఉన్న వారి రోజువారీ పొగాకు వాడకం 3.1 శాతం నుంచి 6.2 శాతం పెరిగింది. వీరంతా శారీరకంగా నిష్క్రియాపరంగా ఉన్నారు. దీని ఫలితంగా 1.8 శాతం మంది అధిక బరువు మరియు ఊబకాయం కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే యువకులు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. నేషనల్‌ ‌నాన్‌-‌కమ్యూనికబుల్‌ ‌డిసీజెస్‌ ‌మానిటరింగ్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా మరియు నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్ అం‌డ్‌ ‌రీసెర్చ్ (ఎన్‌సిడిఐఆర్‌) ఇటీవల కనుగొన్న దాని ప్రకారం 15-17 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో నాన్‌-‌కమ్యూనికబుల్‌ ‌వ్యాధులు(ఎన్‌సిడి) పెరుగుతున్నాయి. ఈ సమస్య రోజు రోజుకు పెరిగి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.

అధ్యయనం ప్రకారం, ప్రతి పది మంది యువకుల్లో ఒకరు మద్యం తాగుతున్నారు. వివిధ రకాల పొగాకు ధూమపానం చేస్తున్నారు. నాల్గవ వంతు మంది శారీరకంగా నిష్క్రియాపరులుగా ఉన్నారు. 6.2 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నారు. కౌమార దశలో ఉన్నా వారు వారానికి ఒకసారి సాల్టెడ్‌ ‌మరియు వేయించిన భారతీయ రుచికరమైన పదార్థాలను తింటున్నారు. దేశం జనాభాలో 21 శాతం కౌమార దశ ప్రజలు ఉంటే వీరిలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన ఉందని ఎన్‌సిడి సర్వే పేర్కొంది. ప్రపంచంలో దాదాపు 1.5 బిలియన్‌ ‌కౌమార జనాభా ఉంటే వీరిలో అత్యధికంగా భారతదేశంలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోక పొతే భావి భారత పౌరులే దేశ భవిషత్తు అని చెప్పుకోవలసిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండదు.

Leave a Reply