Take a fresh look at your lifestyle.

శాసన మండలిలో మీ గొంతునవుతా..

పట్టభద్రులారా ఆశీర్వదించండి..
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్.ఎల్.సి అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ పట్టభద్రులైన యువతకు విజ్ఞప్తి

మిర్యాలగూడ: శనివారం మిర్యాలగూడలో ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఎమ్.ఎల్.సి ఎన్నికల సన్నాహక సమావేశాని నిర్మహించటం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు కలిగిన విద్యా వ్యాపార వేత్త పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికే పట్టభద్రులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసింది ఏమి లేదన్నారు. కార్పొరేట్ కళాశాల విద్యా వ్యాపారంతో ప్రారంభమై ఈరోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టే స్థాయికి ఎదిగండన్నారు.ఆ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు ఉండవని అందినంత దోచుకునే విదంగా వ్యవహరిస్తారన్నారు. నిజంగా మాట్లాడుకోవాలంటే పల్లె రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కెసిఆర్ సంస్థానంలో నోట్ల కట్టలు లెక్కపెట్టే ఒక మిషిన్ అన్నారు. ఈ నోట్లు లెక్క పెట్టే మిషన్ తెలంగాణ సమాజానికి ఏమి అక్కరకొస్తడని నేను అంటున్నాని చెరుకు సుధాకర్ అన్నారు.

ఈయన తెలంగాణ నిరుద్యోగులకు అక్కరకు వస్తాడా.! తెలంగాణ ఉద్యోగులకు అక్కరకొస్తడా.! అంగన్వాడీల హక్కుల కోసం పోరాడాతాడా.! ఏనాడు ఉద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి పల్లెత్తు మాట కూడ మాట్లాడని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఓటు ఆడుగుతున్నారని వారన్నారు. కరోనా కాలంలో వేలాది మందిని వివిద ప్రైవేట్ రంగాలకు చెందిన వారిని తొలగిస్తే ఒక్క మాట మాట్లాడలేదన్నారు.నాగులు అనే తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయలేదన్నారు.ఇది ఆలోచించాల్సిన సమయమని నిరుద్యోగులు అంతా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి నిరుద్యోగి ఆలోచన చేయాలి ప్రశ్నించే దమ్మున్న ఒక ఉద్యమకారుడిగా పోటీలో ఉంటున్నాన్నరు. చంద్రశేఖర్ రావు పట్టభద్రుల ఓట్లకు నోట్లతో ఎరవేసే పరిస్థితి ఉంది .మోసపోవొద్దని విజ్ఞప్తి చేస్తున్నాన్నారు.అదికార పార్టీ పట్టభద్రుల సర్టిఫికెట్ లు తీసుకొని ఓటరు నమోదు పేరుతో డేటా కలెక్టు చేస్తుందని ఇది మోసపూరిత చర్య అన్నారు.ఇది స్వతంత్రమైన పోటీ.. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదన్నారు.డాక్టర్ చెరుకు సుధాకర్ గా నన్ను శాసన మండలికి పంపాలని కోరారు. నిస్వార్ధమైన వ్యక్తిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిరుద్యోగుల ఆకాంక్షలను సాధించే దిశగా మీ వైపున ఉంటానని వారన్నారు.

ప్రశ్నించే గొంతుకనేకాదు సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఎంతటి సమరానికైనా వెనుకాడనన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు పూర్తి వివక్షతకు గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కులానికి ఒక భవనం కట్టిస్తున్నారు కానీ రాజకీయాలలో బడుగులకు ప్రాధాన్యత కల్పించడం లేదని వారన్నారు. దురదృష్టం ఏమిటంటే పెద్దల సభ అయిన శాసనమండలికి కూడా పెద్ద కులాల వారినే అన్ని పార్టీలు అభ్యర్థిగా నిలబెడుతున్నాయి ఇక్కడ కూడా బలహీన వర్గాల వివక్షతకు గురవుతున్నారన్నారు. చెరుకు సుధాకర్ అంటే ప్రతిపక్ష నాయకుడు ఒకటే కాదు అదికార పక్షం ఆగడాలతో పాటు ప్రతిపక్షాల లో ఉన్నటువంటి డొల్ల తనాన్ని బయట పెట్టే దమ్మున్న నాయకుడు అన్నారు. పట్టభద్రులు అందరూ కలిసి నన్ను గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఒక దమ్మున్న నాయకుడు ఎట్లా ఉంటాడో నిరూపిస్తానని వారన్నారు.నేను వ్యక్తి గత పోకడలకు సహజంగానే వ్యతిరేకం అన్నారు.కేసీఆర్ కుటుంభం తప్ప ఉద్యోగులు,నిరుద్యోగులు సకల రంగాల ప్రజలు తీవ్రమైన మనోవేదనతో బాదపడుతున్నారని వారన్నారు.శాసనమండలి ఎన్నికల్లో మీరిచ్చే తీర్పు కేసీఆర్ కు కనువిప్పు కలగాలన్నారు.

చెరుకు సుధాకర్ గారిని గెలిపించడం మా బాధ్యత…
మట్టి మనిషి పాండురంగారావు
చెరుకు సుధాకర్ కు మద్దతిచ్చిన వారిలో మట్టిమనిషి వేనేపల్లి పాండు రంగారావు మాట్లాడుతూ కేసీఆర్ కు బలమైన శక్తినిచ్చిన చెరుకు సుధాకర్ నే తొక్కడానికి కేసీఆర్ పూనుకున్నాడని ఇంతటి దుర్మార్గాలకు కేసిఆర్ ఒడికడతాడని నేను అనుకోలేదన్నారు.సుధాకర్ గారిని శాసనమండలికి పంపడం మా బాధ్యత అని వారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన తల్లికోడిలాంటి వ్యక్తి అని పాండు రంగారావు అన్నారు. ఈ కార్యక్రమంలో,శ్యామ్ సుందర్(ఎస్.ఎస్.టి ఇంజనీర్ల సంఘం),సాగర్(భగత్ సింగ్ యువజన సంఘం),జి.ఉదయ సామాజిక కార్యకర్త,కొండేటి మురళి టి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు, నిరుద్యోగ యువత సంజు కుమార్,శివ తేజ,సతీష్ కుమార్, రాజు,కళ్యాణ్, క్రిష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply