శుభాకాంక్షలు తెలిపిన వారికి సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానాలు ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, డీఎంకే అధినేత స్టాలిన్, ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్భేఘల్, సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమంగ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎంకు కేసీఆర్‌కు ఫోన్‌చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, యూనియన్మినిస్టర్స్ డివి సదానందగౌడ, అర్జున్ ముండా, అస్సాం ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్‌దేబ్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కర్నాటక సీఎం బిఎస్ యడ్యూర ప్ప, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సినీనటులు మహేశ్‌బాబు, శ్రీకాంత్, అనసూయ భరద్వాజ్, నితిన్, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ బాబీ, వంశీపైడిపల్లి, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు సంబంధించిన యూకే బ్రిటిష్ హైకమిషనర్ డా.ఆండ్రూ ప్లెమింగ్ తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలుతెలిపారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడూసుఖసంతోషాలతో చక్కటి ఆరోగ్యంతో చల్లగా ఉండాలని ప్రధాన మంత్రి మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ వాల్ , రాష్ట్ర గవర్నర్ తమిళిసై, చిరంజీవి, కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, పద్మశ్రీ మిస్ సునితా కృష్ణన్, దివ్యకుమారి, సునియల్నారంగ్, నితిన్ అగర్వాల్, జోయల్ రిఫ్ మాన్, ఎన్ బైరన్‌సింగ్, పిప్యూ, దియాకుమార్, తదితరులు సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనపట్ల చూపిన ఆదరాభిమానాలను మరచిపోలేనివని సిఎం తెలిపారు.