Take a fresh look at your lifestyle.

పిన్న వయస్సులో దేశ ప్రధానిగా రాజీవ్ గాంధి

ఆగస్ట్  20…‌దివంగత మాజీ  ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ జయంతి
సద్భావనా దినోత్సవం


40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ ‌గాంధీ అప్పట్లో చిన్న  వయస్కులైన నేతల్లో ఒకరు. అలాగే ఆయన తాత, నెహ్రూ కుటుంబంలో… జవహర్‌లాల్‌ ‌తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి వయసు 58 సంవత్సరాలు, ఆయన తల్లి ఇందిరా గాంధీ 1966లో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్‌ ‌గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద.
రాజీవ్‌గాంధీ 1944లో ఆగస్ట్ 20‌న ముంబైలో జన్మించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి ఆయన తాత నెహ్రూ ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్‌ ‌వయసు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆయన తల్లిదండ్రులు ఇందిరా ఫిరోజ్‌  ‌లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. 1984 అక్టోబర్‌ 31‌న తల్లి ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధాన మంత్రిగాను, కాంగ్రెస్‌ అధ్యక్షునిగానూ ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజీవ్‌ ‌డెహ్రూడూన్‌ ‌లోని వెల్హామ్‌ ‌ప్రైమరీ స్కూల్‌ ‌కు కొన్నిరోజులు వెళ్లాడు. తర్వాత రెసిడెన్షియల్‌ ‌డూన్‌ ‌స్కూల్‌ ‌కు మారిపోయాడు. అక్కడే ఆయన అనేకమందితో స్నేహపరిచయాలను పెంచు కున్నారు. అప్పుడే తమ్ముడు సంజయ్‌ ‌గాంధీ కూడా ఆయనతో కలిశారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలో చేరారు. అయితే రాజీవ్‌ ‌లండన్‌ ‌లోని చాలా త్వరగా ఇంపీరియల్‌ ‌కళాశాలకు మారిపోయారు. అక్కడే మెకానికల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కోర్సు చేశారు.
రాజీవ్‌ ‌కు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఫిలాసఫీ, రాజకీయాలు లేదా చరిత్ర గురించి పట్టించుకునే వారు కాదు. సైన్సు, ఇంజినీరింగ్‌ ‌కు సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా చదివే వారు.ఇంగ్లండ్‌ ‌నుండి ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీ ఫ్లయింగ్‌ ‌క్లబ్‌ ఎం‌ట్రన్స్ ‌పరీక్ష రాసి పాసై కమర్షియల్‌ ‌పైలెట్‌ ‌లైసెన్సు తీసుకుని, వెంటనే దేశీయ విమాన సంస్థ ఇండియన్‌ ఎయిర్‌ ‌లైన్స్ ‌లో పైలెట్‌ ‌జీవితం ప్రారంభించారు. రాజీవ్‌ ఇం‌గ్లండ్‌ ‌లోని కేంబ్రిడ్జ్ ‌లో ఉన్న సమయం లోనే ఇంగ్లీష్‌ ‌చదివే ఇటాలియన్‌ ‌లేడీ సోనియాతో ఆయనకు పరిచయమై, ప్రేమగా మారి, 1968లో అక్కడే వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరు పిల్లలు రాహుల్‌, ‌ప్రియాంకతో కలిసి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట్లో నివాసం ఉండేవారు.
1980లో సంజయ్‌ ‌గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో, తన తల్లిని అనేక సవాళ్లు చుట్టు ముట్టిన పరిస్థితుల్లో రాజీవ్‌ ‌రాజకీయాల్లో చేరాల్సిందిగా ఒత్తిడి బాగా పెరిగి, బలవంతంగానే ఉత్తరప్రదేశ్‌ ‌లోని అమెథీ స్థానానికి పోటీ చేసి, ఉప ఎన్నికల్లో రాజీవ్‌ ‌గాంధీ ఘన విజయం సాధించారు. 1984లో అక్టోబర్‌ 31‌వ తేదీన  ప్రధాన మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురి కావడంతో రాజీవ్‌ ‌ప్రధానమంత్రిగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించాల్సి వచ్చింది. తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్‌ ‌సభ ఎన్నికలకు వెళ్ళి  ఫలితాల్లో అత్యంత ఘన విజయం సాధించారు. అంతకుముందు ఏడు సార్లు జరిగిన ఎన్నికల్లో కంటే రాజీవ్‌ ‌హయాంలో ఎక్కువ సీట్లను సాధించారు. 508 లోక్‌ ‌సభ సీట్లకు గాను 401 సీట్లు గెలుచుకున్నారు. ఆలస్యంగా, అయిష్టంగా రాజకీయాల్లో ప్రవేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించడం విశేషం. రాజీవ్‌ ‌ప్రధానిగా భావి భారత దేశం ఎలా ఉండాలి అనే యోచించారు. వ్యక్తి తన కులం, పుట్టుక, మతం, రంగు మొదలైన వాటితో సంబంధం లేకుండా అభివృద్ధిని అనుభవించాలని ఆయన కోరుకున్నారు. యువతకు ఓటు హక్కును కల్పించడంలో, రాజ్యాంగంలోని 73వ ఆర్టికల్‌ ‌ద్వారా స్థానిక సంస్థలకు నేరుగా కేంద్ర నిధులు వచ్చే విధంగా కృషి చేశారు. ఎన్నో ప్రజాహిత, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 1984, అక్టోబరు 31 న తల్లి దారుణ హత్యకు గురైన తర్వాత ప్రధానమంత్రి అయిన రాజీవ్‌ 1989, ‌డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధాన మంత్రిగా పని చేశారు. రాజీవ్‌ ‌ప్రధానిగా ఉన్న సమయంలో బోఫోర్స్ ‌కుంభకోణం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసింది.  మరియు 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటమికి దారితీసింది. 1991 మేలో  ఎన్నికల ప్రచారంలో భాగంగా నెలరోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేకచోట్ల 250 సభల్లో మాట్లాడారు. ఆయన మే 20 మధాహ్న సమయములో బయలుదేరి భువనేశ్వర్‌ ‌మీదుగా, ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని కొన్ని నియోజక వర్గాలలో పర్యటించారు. సాయంత్రం 6.30కి వైజాగ్‌ ‌నుంచి బయలుదేరి చెన్నై చేరుకొని, సాయంత్రం 8.30ని, లకు స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకురాలు మరకతం చంద్రశేఖర్‌ ‌తో కలసి గ్రాండ్‌ ‌వెస్ట్రన్‌ ‌ట్రంక్‌ ‌రోడ్దు ఆలయ ప్రాంగణములో ఉన్న సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే  రాజీవ్‌ ‌గాంధీ మానవ బాంబు పేలుళ్లతో హతమార్చ బడ్డారు. ఎల్‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం బాధ్యులు నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌ ఎల్‌టీటీఈ ఉగ్రవాదులతో కలిసి రాజీవ్‌ ‌గాంధీ హత్యకు కుట్ర పన్నారు. మే 21న రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 14 మంది హతులైనారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply