ఎవరికి వారే తమ స్వార్ధంతో జీవించే నేటి సమాజంలో మానవత్వానికి మరో పేరే ఆ మంచి సేవా గుణం కలిగిన యువకులు. ఈ యువకులే నేటి సమాజానికి పునాదులు అనేలా స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 12వ తారీఖున మండల పరిధిలోని ఆర్. కొత్తగూడెం పంచాయితీలో ని దానవాయిపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగి మల్లం వీరాస్వామి అనే కుటుంబం సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ సంగతి పాఠకులకు విధితమే. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన క్రేజీ బాయ్స్ యూత్ సభ్యులు నడుంబిగించి 50,000 రూపాయలు నగదు సమీకరించి, దానిలో 25, 0000/రూపాయలతో ఆ కుటుంబానికి ఇంట్లోకి కావాల్సిన బీరువా, మిక్సీ, వంట సామాగ్రి తదితర నిత్యవసర సరుకులను కొనుగోలు చేసి, వాటితో పాటుగా 25 వేల రూపాయల నగదును స్థానిక సర్పంచ్ , ఉప సర్పంచ్ ల ద్వారా వారికి సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ముప్పిడి లక్ష్మి, ఉప సర్పంచ్ అల్లి సాగర్ మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన క్రేజీ బాయ్స్ యూత్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఉత్సాహం, ప్రేరణ కలిగించిందని,మున్ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యస్. శ్రీనివాసరావు, మండల మాల మహానాడు కార్యదర్శి, క్రేజీ బాయ్స్ యూత్ ఆర్గనైజర్స్ రుంజా రాజా, డి జానీ, ఇబ్రాన్, టి రవి, హరి, కే వీరభద్రం, సిహెచ్ రవివర్మ, ఎన్ రాజు, నాగరాజు, రాజబాబు, ఎన్ మురళి, బి సంతోష్, రాజ్ కుమార్, నవీన్, ఎన్ రమేష్, ఎస్ విజయ్ కుమార్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.