Take a fresh look at your lifestyle.

గోదావరిలో యువకుడు గల్లంతు

Young man died in Godavari river

- Advertisement -

బూర్గంపాడు: ఈతకు వెళ్ళిన ఐదుగురు యువకుల్లో ఒక యువకుడు గల్లంతైన సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామం వద్దకు ఏఎంసి కాలనీ కి చెందిన ఐదుగురు యువకులు గోదావరిలో ఈతకు వెళ్ళారు. ఐదుగురు యువకుల్లో చంటి (19) అనే యువకుడు ఘల్లంతయ్యారు. ఈ సంఘటన వివరాలు అతనితో పాటు వెళ్ళిన యువకులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. ఫక్ష్మర్‌ ‌సిబ్బంది గోదావరిలో వెతకగా ఎటపాక వద్ద చంటి మృతదేహం లభ్యమైంది. ఇతని తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply