Take a fresh look at your lifestyle.

మైనర్‌ ‌బాలిక అదృశ్యం….

  • తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • అనంతరం వాట్సప్‌లో పెళ్లి ఫొటోల వైరల్‌

ఈ ‌నెల 9న ఇంటికి వస్తున్నాని చెప్పి రాక పోవడంతో ములుగు జిల్లా కొడివెల కుంట గ్రామానికి చెందిన మైనర్‌ ‌బాలిక తండ్రి మంగళవారం నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ ‌కేసు నమోదు చేశారు. అనంతరం మైనర్‌ ‌బాలిక దుగ్గొండి మండలం మల్లం పల్లికి చెందిన మైనర్‌ ‌బాలుడితో పెళ్లి చేసుకున్న ఫోటోలు వాట్సప్‌లో హల్‌ ‌చల్‌ ‌చేశాయి. దీంతో తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ ‌కేసు నమోదు చేసినట్లు నల్లబెల్లి ఎస్సై వెంకటేశ్వర్లు బుధవారం విలేకరులకు తెలిపారు.

స్థానికుల కథనం ప్రకారం …. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని ఆశ్రమ పాఠశాల మైనర్‌ ‌బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 9న రుద్రగూడెం స్కూల్లో ఆటలున్నాయని అమ్మాయు వాళ్ల బాబాయి ఇంట్లో రాత్రి ఉందని చెబుతున్నారు. తెల్లవారి ఇంటికి వెళ్తానని చెప్పి ఎంతకు రాకపోవడంతో పలు చోట్ల గాలించి చివరకు 10న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుపుతున్నారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన మైనర్‌ ‌బాలుడితో వివాహం చేసుకుని వాట్సప్‌లో పెట్టడంతో అందరూ షాకయ్యారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Leave a Reply