Take a fresh look at your lifestyle.

మానసిక శారీరక ఎదుగుదలకు యోగా: కలెక్టర్‌

మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు యోగా ముఖ్యమైందని కలెక్టర్‌ ‌హరిత అన్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులకు స్థానిక ఇండోర్‌ ‌స్టేడియంలో సోమవారం రెండు రోజుల యోగ శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్‌ ‌హరిత ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 133 హైస్కూల్‌, 12 ‌కెజివిబి, 6 మోడల్‌ ‌స్కూల్‌ ఉన్నాయని వాటిల్లో రోజు 13800 మంది విద్యార్థులకు యోగ తరగతులను తప్పకుండా నిర్వహించాలన్నారు. యోగను మత పరమైన అంశంగా కాకుండా ఫిజికల్‌ ‌వ్యాయామం గా తీసుకోవాలని, 6 తరగతి నుండి 10 తరగతి విద్యార్థులకు చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయని, యోగతో ఫిజికల్‌, ‌మెంటల్‌గా బాగా ఎదుగుదల ఉంటుందన్నారు.

చదువుతో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలని, ఆసనాలను సరిగ్గా వేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో వ్యాయమ ఉపాధ్యాయులు యోగ గురించి బాగా తెలుసుకొని విద్యార్థులచే చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈవో వాసంతి, ఆయుష్‌ ‌డాక్టర్‌ అమృత వల్లి, యోగ ట్రైనర్‌ ‌జెడ్పిహెచ్‌ఎస్‌ ‌పిఇటి కమలాకర్‌, ‌డిఇవో కార్యాలయ సూపరింటెండెంట్‌, ‌వ్యాయమ ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Tags: Yoga for Mental, Physical Improvement, Collector, haritha

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply