Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఘనంగా యోగా దినోత్సవం

యోగా డే లో పాల్గొన్న మంత్రులు,ప్రజలు

యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : అం‌తర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు. స్వచ్ఛంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో పలుచోట్ల యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేశారు. యోగా విశిష్టతలు, దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదని సంపూర్ణ ఆరోగ్యమే ఓ వరమని మంత్రులు పలువురు చెప్పారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని… ఒత్తిళ్లను దూరం చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు పలుచోట్ల మంత్రులు, ప్రజలు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులందరూ ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. సిద్ధిపేటలో జరిగిన యోగా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు యోగాసనాలు వేశారు. జిల్లాల్లో యోగాసనలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ వాసులు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మంలో యోగా డేను ఘనంగా జరిపారు. పలు శిక్షణా సంస్థల ఆధ్వర్యంలో యోగాసానాలు వేశారు. విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ… ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలను శిక్షకులు వివరించారు.

- Advertisement -

యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌రావు

నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆరోగ్యానికి, మానిసక ధృఢత్వానికి యోగా ఎంతో మేలు చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌ ‌విభాగం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలన్నారు.

ప్రపంచంలో చాలామందికి ఆహారం అలవాట్లతోనే రోగాలు వస్తాయన్నారు. యోగాతో రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు యోగా సాధన చేయవచ్చని తెలిపారు. శారీరక, మానసిక సమస్యల నుంచి తమను తాము కాపాడుకోవచ్చని చెప్పారు. యోగా, వాకింగ్‌, ‌సూర్య నమస్కారాలు చేస్తే రోజువారీ పనులను మరింత చురుగ్గా చేసుకోవచ్చన్నారు. భారతదేశాన్ని చూసి వివిధ దేశాలు యోగాను నేర్చుకుంటాయని తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో గర్భిణులకు యోగాలాంటి శిక్షణ ఇస్తున్నామని, గర్భిణులు యోగాలాంటివి చేస్తే నార్మల్‌ ‌డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

Leave a Reply