కొండవాలు, చిన్నగూడు
గుమ్మపాలు, చద్దికూడు!
తెల్లారితే పచ్చదనంలో ప్రభాతిస్తే!
రాత్రయితే చుక్కలింట్లో శయనించడమే!
మబ్బుల పొరల్లో ఊహల విహంగాలు
పుడమి పొత్తిళ్ళల్లో కలల తరంగాలు!
కాసిన్ని కట్టుబాట్లు
కూసిన్ని తడబాట్లు!
కన్ను కారిస్తే కరిగిపోయేవి
మనసు వరిస్తే మెరిసిపోయేవి!
కడుపునిండి, కాస్త కునుకు పడితే
కాలం గడిచిపోయేది!
నిన్నటికి నిన్నటితో సరిపోయేది
రేపటికి, రెపటితోటే ఉదయించేది!
మరి ఎవరు చెప్పారో
నింగిని జయించాలని!
నేలను తవ్వాలని!
నీటిని పట్టాలని!
నాయకుడు అవ్వాలని!
అప్పటినుంచి మొదలయ్యింది
అసహనం!
వినాశననానికి దారి తీస్తూ
వైపరీత్యాలకు తావు ఇస్తూ!
– ఉషారం
9553875577