మనసెంత మౌనంగున్నా
వయసు పరుగునాపేదెవరు
మనిషెంత గంభీరంగున్నా
తీరని ఆశలనాపేదెవరు
మార్గమేదో కనబడుతున్నా
కమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరు
అక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటే
స్ఫూర్తినందిస్తూ ఆలంబనగా నిలిచేదెవరో
జీవన సమరంలో
స్వేదమెంతచిందించిన
విజయబావుటా శిఖరంపై రెపరెపలాడిం చేదెవరో
సి. శేఖర్ (సియస్సార్),
పాలమూరు, 9010480557.