“ఒకటి గాదు,రొండు గాదు. పదిగల్ల నాలికెలున్న మనిషి దునియాల యేడున్నడని జూత్తె ‘‘శెరువు తలాపున బెట్టుకోని శాప దూపకేడిశినట్టే వుంటదుల్లా!’’అడిగినోళ్ళకు,అడ్గనోళ్ళకు ‘‘అయ్యా!సాలు బాంచననే తీర్గ పంటకయ్యే ఇత్తనాలు తొలు సూరు వాన పడంగనె రైతులందరి గల్మకాడికి బండ్లుగొట్టి పంపుతన’’న్న పోశెట్టి నాలికె జెప్పిన మాట యాదికున్నదా!దునియా మొత్తం పరేశాన్ అయ్యేతీర్గ నూరుశాతం రైతులం దరు సర్కార్ ఇత్తనాలే యెయ్యాలని జెప్పిన మాట ఆరేండ్ల సంది కాట గలిశింది.గిసొంటి ఏతులు జెప్పేనాలికెను యేంజేయాలె! గిదేందని సంగతడుగబోతె తుపాకి రాముని తీర్గ తాపకోపాలి ‘‘మాట తప్పుతె తలకాయ నరుక్కుంటననుడే’’ లచ్చలసార్లు నరుక్కున్న తలకాయలేడ కుప్పబోశిండ్లో దేవులాడాలె! దినాం పది మల్కల మాట తప్పే నాలికెలు ఇజ్జెత్ లేని కతలు వడుడంటె గిట్నే వుంటది.’’ఇత్తు మిగులకుంట నూరుశాతం పంట సర్కారే గొంటది’’అని జెప్పిన నాలికెటువాయె!వూల్లె మొకాన జూత్తె రైతులు బడె అరిగోసకానత్తది. ఓ మొకాన ఆనలువలాయించి దంచి కొట్ట బట్టె!గని బత్తాలిం క లారీలెక్కకపాయె!”
‘‘ఒరిత్త!కొరోనంటె ఒల్లెక్కాల బీమారేనా! నిజంగనా!’’గట్టిగ రొండు గోళీలేసుకుంటె యెనుక జూడకుంట వుర్కిపోయే దానికి మనం గింతగనం లాగులు తడుపుకుంటివి. గీ దావకాన్లుడాక్టర్లు ఆక్సీజన్ బుడ్లు, వెంటిలేటర్లు గివన్నీ వొట్టొట్టి కతలుపడుడేనని సారు జెప్పేదాంక యెరుకలే మావా! గీ శాందార్ ముచ్చట ముందుగాల్నే యెరుకైతె దావకాన్లు బోకపోదుముగాళ్ళకు గట్టే లచ్చలకులచ్చల ఫీజులకోసం యిండ్లు వాకిళ్ళమ్ముకోక పోదువు.గింతధిమాక్ సుత లేకుంట బుగులుతోనిఆగమైతిమిరొండు గోలీలకు ఏ పాటయ్యేది,పది రూపాలతోని ఒడిశెదానికి పదింతల పరెశానైతిమి.కోత్తె శెటాకుండని బక్క పానం సార్ ‘‘ఏందదీ…ఆం…ఆ… డోలో! డోలో గోలీ’’ ఇంకో గోలీ యేందో!గీ రొండు గోలీల తోనే కరోనా సంగతర్సుకున్నడట! ఐదొద్దులకు టెస్టింగ్ జేయిస్తె పెయి మీద కరోనా లేనే లేదట!అయితె ఇన్నొద్దులు దావకాన్లల్ల నడిశిందంత లొట్టపీసేనా! రొండేండ్ల సంది దునియా గింతగనం గాయిగాయి గాబట్టె! కొరోనా బీమారచ్చుడంటె సావు కాయమనుకోబట్టె!గీ ముచ్చట అమెరికోళ్ళ శెవులేయనుండె! ఆరోగ్గె సంస్థోళ్ళ కు యెరుకైతె కరోనచ్చినోళ్ళంత గాలిమోటర్లేసుకోని ఫామవుజు దావకాన కాడ దిగెటోళ్ళు.
లచ్చలకు లచ్చలు లెక్కలు బెట్టి పీనుగల జేశిన కొరోనా దునియా మొత్తం గజ్జునణికించె! గసొంటి బీమారిని గింతగనం అల్కగజేశి జెప్పుడు ఇచ్ఛంత్రం గాబట్టె!దావకాన్లు నామోశి గాబట్టె! డాక్టర్లూ..నామోశాయె! సోయి తప్పి మాట్లాడి వుండో లేని ఇజ్జెత్ తీసుకున్నట్టాయె!అందరు ఇకిలియ్య బట్టిండ్లు,శీకటి పడ్డంక సొలిగే మాటలు అంబటాలకే సోయి దప్పి సొలిగేకాడికచ్చింది. నోటికచ్చిందే మాటైతె గా మాట జెప్పేటి నాలికె నాలికేనా!ఇంకేమన్ననా! ఆనే అనుమానం గొడ్తాంది. మనిషన్నంక నోట్లింత నాలికుంటది.గా నాలికె జెప్పే మాట వాజీబుగుండాలె! పెద్దమనిశనంక పరాశికాల మా టలు, ఒల్లెక్కాల మాటలు,వంకర్లుబోయే మాటలు, తుపాకి రాముని మాటలు జెప్తె జనం దేంతోని నవ్వినా నవ్వుతరు.నాలికె అడ్డగోలుగ మాటలు జెపుతె, ‘‘నోట్లున్నది నాలికెనా! తాటిమట్టనా!’’అని తిట్లు బడ్తరు.నోట్లె తాటిమట్ట యెట్లుంటదో గిప్పుడెరుకైతాంది.గీళ్ళతోని జరంత పైలంగుండాలె!బిడ్డా!తడి గుడ్డతోని గొంతుగోత్తరని మా అవ్వ జెప్పేది ఇచ్ఛంత్రంగ గీ నడ్మన రొండు నాలికెలు,మూడు నాలికెలున్నోళ్ళు సుత కానత్తాండ్లు.
ఏ నాలికె యేం జెప్పబట్టెనో!దానికున్న ఫాయిదేందో! సుట్టుపక్కనోళ్ళకు యెరుక గావాలె! ‘‘నేను పార్టీ మారుతనని యెవలితోని జెప్పలె! యేడ సుత జెప్పలె! గిప్పుడు నేనున్న నా పార్టీ నాకు శానిచ్చింద’’ను కుంట తాపకోమల్క మీడి యాల కానత్తాండంటె బేరాలు రేవుకత్తానయనుకోవాలె!• •పుమాపు కండువా మార్సుడు కాయముల్లా! ఏ కండువతోనెంత ఫాయిదానే లెక్కలు తేలేదాంకనే నాలికె తీరొక్కపోకడ పోతది.ఎసొంటి పదవి రాదని కండువ మారెటోళ్ళుంటరు.అన్నిపదవులున్నంక సుత గివన్ని గాదని వున్న పార్టీతోని ఇడుపుకాయితం జేసుకునెటోళ్ళ నాలికె ఇంకోతీరు కతలు వడుతది. ఏనుగల తినటోని సోపతి జేశినంక పీనుగలు తినుడు యెర్కుండదానుల్లా! వూల్లెకూల్లు తినేకాడ ఎకురాల కొద్ది తిన్నంకచ్చిన పులుసరం గీతీర్గనే వుంటది. దోసుకున్నదాన్ని దాసుకునే తిప్పలు అకరికి బురుదల దునుకమంటది.బురుద బూసుకున్నంక నాలికె మాటింకో తీరు పోతది.అటు మొగాన బోవుడే ఆత్మను సంపుకున్న ఇజ్జత్ తక్కువ పనంటె ‘‘ఆత్మ గౌరవం’’ కోసం మళ్ళోమల్క కొట్లాట జేత్తనంటడు. యెన్ని తీర్ల లండు మాటలు జెప్పే నాలికెలున్నయో యేందో!
ఒకటి గాదు,రొండు గాదు. పదిగల్ల నాలికెలున్న మనిషి దునియాల యేడున్నడని జూత్తె ‘‘శెరువు తలాపున బెట్టుకోని శాప దూపకేడిశినట్టే వుంటదుల్లా!’’అడిగినోళ్ళకు,అడ్గనోళ్ళకు ‘‘అయ్యా!సాలు బాంచననే తీర్గ పంటకయ్యే ఇత్తనాలు తొలు సూరు వాన పడంగనె రైతులందరి గల్మకాడికి బండ్లుగొట్టి పంపుతన’’న్న పోశెట్టి నాలికె జెప్పిన మాట యాదికున్నదా!దునియా మొత్తం పరేశాన్ అయ్యేతీర్గ నూరుశాతం రైతులం దరు సర్కార్ ఇత్తనాలే యెయ్యాలని జెప్పిన మాట ఆరేండ్ల సంది కాట గలిశింది.గిసొంటి ఏతులు జెప్పేనాలికెను యేంజేయాలె! గిదేందని సంగతడుగబోతె తుపాకి రాముని తీర్గ తాపకోపాలి ‘‘మాట తప్పుతె తలకాయ నరుక్కుంటననుడే’’ లచ్చలసార్లు నరుక్కున్న తలకాయలేడ కుప్పబోశిండ్లో దేవులాడాలె! దినాం పది మల్కల మాట తప్పే నాలికెలు ఇజ్జెత్ లేని కతలు వడుడంటె గిట్నే వుంటది.’’ఇత్తు మిగులకుంట నూరుశాతం పంట సర్కారే గొంటది’’అని జెప్పిన నాలికెటువాయె!వూల్లె మొకాన జూత్తె రైతులు బడె అరిగోసకానత్తది. ఓ మొకాన ఆనలువలాయించి దంచి కొట్ట బట్టె!గని బత్తాలిం క లారీలెక్కకపాయె!
మర్లేశే నాలిక మంటగలువ! మద్పరిచ్చే మాటలు జెప్పే నాలికెలు పాడువడ! పొద్దునోమాట,పొద్దుగుంకినంకింకో మాట!నౌకరోల్లకు అవ్వల్ దర్జా బతుకులుంటయనె!లచ్చ నౌకర్లిచ్చిన అని జెప్పే మాటెం త డోకాబాజో యెరుకయ్య లోపట,లచ్చల నౌకర్లు లేకుంట మాయం జశిండ్లు. సెంట్రల్ నౌకరోళ్ళ కన్న జరెక్కువనే జీతాలిత్తమన్న నాలికెటుబాయె!వున్నయి కొరుగుడూ,లచ్చల రూపాలు ఎగ్గొట్టుడే జీతాలు బెంచుడని జెప్పే గీ నాలికేడిదుల్లా!గిసొంటి తాకట్ల మాటలు జెప్పే నాలికెలు అందరిని ఆగం జేయబట్టె! మనిషి కడుపుకింత బువ్వ తిన్నోలైతె గిన్ని ఏతులకు బోరుల్లా! నాలికెలెన్ని వున్నయో గని ఇదిజేత్తం అది జేత్త మనుడే గని యేనాడు ముల్లె పంచింది లేదు. తెలంగాణ రాజ్జెంల ‘‘వందశాతం’’…. ‘‘బమ్మాండంగ’’ ….అభివృద్ధి అనుడంటె గా పని సంకనాకినట్టే! అనుకోవాలె!ఏడేండ్ల సంది బమ్మాండంగ బంగారు తెలంగాణ ఆభివుద్ది కానత్తాంది గద! ఏతులు జెప్పుడు తోని యేమన్నయిందాంటే గొర్రెలోలిగె తలకాయలూపి,సప్పట్లు గొట్టుడు బాగచ్చుడే!.
‘‘సూడ్రా! బయ్!ఇక్రమార్క్’’
‘‘ఇప్పటి దాంక యింటివి గదా! మాటలు జెప్పి మాయజేశే టోళ్ళు,తుపాకి రాములు.నాలుగైదు నాలికెలున్నోళ్ళు , పగటి బాగోతోళ్ళు జెప్పే మాటలు వొట్టి యేతులని యెరుకుండి సుత మర్లబడే మనుషుల తాన మాటలెందుకు కరువైనయి?నా ప్రశ్నకు జవాబియాలె! లేకుంటె యెన్కకు బోయి మళ్ళ శెట్టెక్కుడే! నీకే తిప్పలైతది! పైలం!’’ యెప్పటి తీర్గనే బెదిరిచ్చే భేతాళుని పీనుగను బుజం మీదెసుకోని ‘‘ఇను భేతాళ్! ఏతులు జెప్తానని జెప్పెటాయనకెరికె!ఏతులింటానమని ఇనెటోళ్ళకు సుతెరికె!ఏడేండ్ల సంది గొర్లోలిగె తలకాయలూపుకుంట సప్పట్లు గొట్టుడంటె తెలంగాణల గొర్లు బెరువట్టినయి.యేడ జూశినా గొర్లే కానత్తానయి.గోర్లేడన్న మాట్లాడుతయా!మర్లబడుతయా!’’అని నవ్వుకుంట…నవ్వుకుంట….బొందల గడ్డ దాటబట్టిండు.
– ఎలమంద – తెలంగాణ