Take a fresh look at your lifestyle.

నిన్న కొరోనా, నేడు ఎండలు, రేపు మిడతలు

గడిచిన మూడు నెలలుగాకొరోనా వైరస్‌ ‌ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. ఈ వైరస్‌ ‌మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్నది. దీని బారినుండి ప్రపంచం ఇంకా కోలుకోకుండానే, ప్రపంచదేశాలు మరో సునామీకి గురవుతున్నాయి. వేలడంతా కూడాలేని ఓ కీటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పంటలపై దాడి చేస్తూ వ్యవసాయ రంగానికే సవాలుగా మారింది. అయితే ఇంతవరకు మరో దేశంలోనో, మరో ప్రాంతం లోనో ఈ కీటకం వల్ల జరుగుతున్న నష్టాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో చూసి అవునా అనుకున్నాం. కాని అ ముప్పేదో ఇప్పుడు మన కనుచూపుమేరల్లోనే ఉందని తెలియడంతో ప్రజలంతా భయపడిపోతున్నారు. నిన్నటి వరకు కొరోనాతో ఓ యుద్దమే చేయాల్సి వొచ్చింది. దాన్నింకా కూకటివేళ్ళతో పారదోలనే లేదు. ఈలోగా తీక్షణమైన ఎండలు ముంచుకొచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో ఏ జిల్లాలో చూసిన 42 , 45డిగ్రీల ఉష్ణోగ్రతకు మించే నమోదవుతున్నది. ఎండల తీవ్రతకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రోహిణి ప్రవేశంతో సూర్యతాపం విపరీతమైంది. ఈ పరిస్థితిలో మరో ప్రళయం రాబోతోందన్న వార్త తెలంగాణ ప్రజలకు నిద్రపట్టకుండా చేస్తున్నది. ప్రధానంగా రైతాంగమంతా భయపడిపోతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కొరోనాను చైనా మోసుకు వొస్తే, ఇప్పుడు మరో శత్రు దేశమైన పాకిస్తాన్‌ ‌నుండి మిడతల దాడులు మొదలైనాయి. ఎక్కడో అయితే మనమంత బెంగపడాల్సిన అవసరంలేదు. తెలంగాణకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అవి విడిది చేసినట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుం అక్కడ మాటువేసుకుని కూర్చున్న ఈ రాకాసి మిడతలు మన రాష్ట్రంలోకి ఏ క్షణాన్నైనా చొరబడవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కొరోనా కారణంగా ఇప్పటికే అన్నివిధాలుగా, అన్ని రంగాల్లో తీవ్ర నష్టంవాటిల్లింది. ప్రపంచాన్నే ఒణికించిన ఈ మహమ్మారినుంచి తట్టుకుని భారతదేశం నిలబడగలిగిందంటే అందుకు మన వ్యవసాయరంగమే కారణం. రెండు, మూడు నెలలుగా అన్ని రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోయినా వ్యవసాయ రంగం మాత్రం యధావిదిగా కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం మొదటినుండి ఈ రంగంపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సాగునీరు, విద్యుత్‌ ‌సరఫరా సమృద్ధిగా ఉండటం కూడా ఎలాంటి ఆటంకాలులేకుండా ఈ రంగంలో ఉత్పత్తి జరుగడానికి కారణమైంది. విచిత్రమైన విషమేమంటే పంట విస్తీర్ణంతోపాటు, ఉత్పత్తికూడా ఎక్కువే అవడంతో ఈసారి రైతాంగం కండ్లలో ఆనందాన్ని చూడగలుగుతున్నాం. కొనుగోలు, గిట్టుబాటు ధర కొంత ఇబ్బందికరమైనప్పటికీ గతంతో పోలిస్తే రైతు కొంతవరకు సంతృప్తి చెందాడ నడంలో అతిశయోక్తి లేదు.

అయితే వొచ్చే వర్షాకాల పంటనుండే ఈ రంగంలో అధునాతన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలను సిద్దంచేస్తోంది. ఏ పంట ఎక్కడ ఎంతమేర వేయాలన్న సూచనలతో రైతులకు లాభాలను చూపిస్తామని ప్రతిజ్ఞ చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదుగాని ఈ రంగానికి ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకురానుందన్న భయం మాత్రం పట్టుకుంది. రాకాసి మిడతలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయి. పలు రాష్ట్రాల్లోని పంటలపై దాడిచేసి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు వాటిదారి తెలంగాణ వైపుకు మళ్ళే సూచనలు కనబడుతున్నా యంటున్నారు అధికారులు. మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర మీదుగా తెలంగాణవైపుకు పయనమైనాయట. మరో నాలుగు వందల కిలోమీటర్లు దాటితే ఇక తెలంగాణలో ప్రవేశిస్తాయంటున్నారు. వీటికి గంటకు పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్‌ ‌దూరం ప్రయాణించే సామర్థ్య ముండడంతో ఎప్పుడైనా తెలంగాణలో చొరబడ వచ్చంటున్నారు. అయితే వాటి గమనం ఎటువైపుం టుందన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుం దంటున్నారు అథికారులు. ఇప్పుడిప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం కోలుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు నీరు అనేక ప్రాంతాల్లో అందు బాటులోకి వొస్తున్నది. దీంతో పంటల విస్తీర్ణం గతంకన్నా అనేక రేట్లు పెరుగుతున్నది.

విత్తనాలు, ఎరువులు, మార్కెట్‌ ‌తదితర సమస్యలు ఇంకా ఒక కొలిక్కి రావాల్సిఉంది. ఆ సమస్యలతోనే సతమతమవుతున్న రైతాంగానికి మిడతల దాడుల భయం పట్టుకుంది. నిజంగా ఇతర రాష్ట్రాల్లోలాగా తెలంగాణలోకూడా మిడతల దాడి జరిగితే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పాకిస్తాన్‌నుండి ప్రవేశిస్తున్న చొరబాటుదారు ల్లాగానే ఈ మిడతల దండు మనదేశంలోకి చొచ్చుకొచ్చాయి. ఉత్తరాఫ్రికా దేశాలనుంచి ఇవి పాకిస్తాన్‌ ‌మీదుగా ఇప్పటికే రాజస్థాన్‌, ‌గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాకు విస్తరించాయి. ఆయా రాష్ట్రాల్లో ఈ రాకాసి మిడతల కారణంగా లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టమేర్పడింది. జైపూర్‌లోనైతే అవి సునామీనే సృష్టించాయి. ఒక్కో మిడత రోజుకు తనబరువుకు సమానమైన ఆహారాన్ని తీసుకుం టుందట. వాటి సంతా నోత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతుందట. వొచ్చే నెల అంటే జూన్‌లోగా వాటి సంఖ్య ఇప్పుడున్న దానికంటే నాలుగు వందల రెట్లు పెరిగే అవకాశ ముందంటున్నారు. దీంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైనప్పటికీ వాటిని నియంత్రించడం పెద్దసమస్యగానే ఉంది. మహారాష్ట్ర లోని అమ రావతికి చేరుకునేలోగానే వాటిని నిరోదించని పక్షంలో మహారాష్ట్ర సరిహద్దు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిజా మాబాద్‌, ‌కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ ‌జిల్లాల్లోకి చొచ్చుకొచ్చేప్రమాదముందంటున్నాయి అధికార వర్గాలు. కొరోనా దాడిలోకూడా పంటలను పండిం చుకున్న రైతాంగానికి మిడతల దాడి సవాలవుతుందన్న భయం పట్టుకుంది.

Leave a Reply