Take a fresh look at your lifestyle.

ఎన్నాళ్ళు..?

ఏడాదికేడాదుల్లెన్ని గడిచిపోతున్న
ఎడారిలాంటి భయాన్ని ఏదో మూలన దాచుకుని
మేకపోతు గాంభీర్యాన్ని ముసుగేసుకుని
జీవన సమరంలో విజయాలెన్ని సాదించిన
అడుగడుగునా అవమానాల్నెన్నెదురుకున్నా అంతరిక్షదారుల్లో అడుగేసిన
అది అంతవరకే

జననం మరణం
విజయం వినయం
సమయం సమరం
అన్ని కలబోసిన హృదయం
అంతలోనే అడుగులకు సంకెళ్లు సాధింపులు
వెక్కిరింతలు వేధింపులు
నడవాల్సినదారులకు అడ్డంగా ముళ్లకంచెలు

మహిళలు ‘మహి’లో మహారాణులు
నిజంగా నిజాయితీగా
నిఖార్సయిన జీవితం
కా…నీ
అక్కడ.. ఇక్కడ.. ఎక్కడైనా
గుంటనక్కలు కాచుకూచుంటయ్‌
‌వినయంగా ఏమార్చడానికి
మాయమాటలతో ఊహల పద్మవ్యూహంలోకి నెట్టి
నిన్నటి నీ కలలను
రేపటి భవిష్యత్తును
ఈరోజే సమాదిచేయడానికి
నిర్ధాక్షిణ్యంగా నిర్భయలౌవుతున్నరు

కాలంతో పోటిపడుతూ కాంక్షలన్ని నెరవేర్చుకున్నా
వేసే అడుగుల్లో ఆంక్షలు
అదిరోహించడమే కావాల్సింది
కాలమేదైనా కామాంధులు
కాలసర్పాలై కాటేస్తుంటే
కాయాన్నంతా కత్తులతో నరుకుతూ నరకాన్నిక్కడే చూయిస్తూ కాటికి పంపుతున్న
సమిధలౌతున్నరు

మహిలో మగవాడు మగాడే
తల్లి లాలనలో పెరిగినా
తప్పటడుగులే దారులౌతున్నయ్‌
అరచేతిలో విశ్వజ్ఞానం చేరి
బుర్రలో చెడుచేరి చెదలుపట్టి
వావివరసులు మరచిన మృగమైతున్నడు

మహిళలు ఎంత సాధించిన
లోకం పోకడేమిటో ఎరిగి
మృగాళ్ల మాయను తిప్పికొట్టే
నేర్పరితనం వారికి ఆభరణమవ్వాలి
ఆకాశం అంచుల్ని తాకినా
అవకాశవాదులకు ఆమడదూరముండాలి
ఏమరపాటుతనం విడిచిపెట్టి
ఎల్లవేళలా తనకుతానే
రక్షణ కవచం కావాలి
– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు,
ఫోన్‌:9010480557.

Leave a Reply