Take a fresh look at your lifestyle.

ఏది ముఖ్యం…

తాగితే జరిగే అన్ని రకాల చెడు, హింసా సంఘటనలకు ఈ కరోనా కాలం లో ఎంతవరకు కట్టడి చేయగలము..ఆలోచించాల్సిన అంశం. అన్నిటి కంటే ముఖ్యంగా సడలింపుల వలన కరోనా తగ్గిపోయింది అనుకునే నిరక్షరాస్యత, అవగాహన లేమి ఉన్న ప్రజలు ఇదివరకు చేపట్టిన ఏ చర్యలు ఇకపై పాటించరుఇప్పటికే రోడ్ల మీద చాలా మంది మాస్కులు లేకుండా గుంపులుగా తిరగడానికి గమనించవచ్చు. ఆర్థిక వ్యవస్థ ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా అన్న మీమాంసలో ప్రభుతం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం మే 29 దాకా లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించింది కానీ చాలావరకు, చాలా వాటికి సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా సిమెంట్‌, ఎలక్ట్రికల్‌, ‌హార్డ్‌వేర్‌ ‌షాప్స్, ‌ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్, ‌రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాలు, ఆర్‌టిఓ ఆఫీస్‌లు, వైన్‌ ‌షాప్‌లు, మొదలైన వాటికి 10 గంటల నుంచి 6 గంటల వరకు వాటికి సంబంధించిన అన్ని మార్కెట్‌ ‌కార్యకలాపాలు కొనసాగించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కరోనా మన తోటే ఉంటది..దాన్ని తెలివిగా ఎదుర్కోవాలి, దానితో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాలి అన్నారు. అది నిజమే. కరోనా లాంటి వైరస్‌, ‌రెండు మూడు నెలలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా రూపు మాసి పోదు. కనీసం  ఒక మూడు సంవత్సరాల కాలం పాటు అయినా ప్రపంచంలో కరోనా వైరస్‌ ఉం‌టుంది.

ఇదివరకు వచ్చిన ప్రాణాంతకమైన వైరస్‌లు అన్ని కూడా ఇంకా ఉన్నాయి. కాకపోతే వాటికి వాక్సిన్‌ ‌కనుగొనడమో, వాటిని ఎదుర్కొనే ఇమ్మ్యూనిటిని, జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడమో జరిగింది.
కానీ పాత వైరస్‌లకి కరోనాకి చాలా ప్రధానమైన తేడా ఏంటంటే మనిషిని మనిషి తాకడం వల్ల మాత్రమే కాదు. ఏ వస్తువుని తాకిన ఈ వైరస్‌ అం‌టుకుంటది. స్పర్శ లేనిది మనిషి జీవితం ఉండదు. పసి పాప నోటిలో పెట్టె పాల సీసా నుండి, ప్రయోగ శాలలో కనిపెట్టే వాక్సిన్‌ ‌వరకు ప్రతిది స్పర్శతో ముడి పడి ఉన్నదే. ఇలాంటి స్పర్శను ఆపడానికే ప్రతి దేశం లాక్‌ ‌డౌన్‌ను అమలు చేసింది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే మనుషుల ద్వారా వచ్చే దానికంటే వైరస్‌ ‌వస్తువుల మీద ఎంత కాలం బతికి ఉంటది, ఆ వస్తువులు చేతులు మారుతున్న కొలది ఎంత వ్యాప్తి చెందుతది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మన గుర్తుంచుకోవాల్సిన అంశం.
ఇప్పుడు లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపుల అంశానికి వస్తే ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవడానికి, ఉత్పాదక కార్యక్రమాలు సరిగా జరగడానికి చాలా షాప్స్ ‌తెరుస్తున్నాము అని చెపుతుంది. అసలు ప్రభుత్వానికి కరోనా వ్యాధిగ్రస్తుల వలన ఎంత ఖర్చు పెరిగింది అనేది ఒక సాధారణ అంచనగా తీసుకుంటే క్రింది విధంగా ఉంటుంది.
ఈ రోజు వరకు అంటే ఈ వ్యాసం రాసే సమయం, మే నెల 6వ తేదీ వరకు తెలంగాణలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 1085. ఒక్కో వ్యాధిగ్రస్తునికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 లక్షల వ్యయం జరుగుతుంది అనుకున్నా కూడా మొత్తం 38.5 కోట్ల రూపాయల వ్యయం జరిగింది. నిన్న లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపులు ఇచ్చే సమయానికి అంటే మే 5వ తారీఖు నాటికి ప్రభుత్వ ఉద్యోగుల వేతన  కోత ఆధారంగా సమకూరిన ఆదాయం, మార్చ్ ఏ‌ప్రిల్‌ ‌నెలల సగం వేతనంతో వచ్చినది 2500 కోట్ల రూపాయలు. ఈ ఆదాయంతో మాస్కులు, మందులు, వలస కార్మికుల పునరావాసం వంటి కరోనా ప్రత్యక్ష చర్యలకు వాడుకోవచ్చు. అంటే కరోనా ప్రత్యక్ష ప్రభావానికి సమకూరిన ఆదాయం, ఎంత ఎక్కువగా ఖర్చు పెట్టి సరిపోతుంది. ఇంకా ఇందులో విరాళాలు, అసెంబ్లీ సభ్యుల వేతన కోతను చేర్చలేదు, అవి కూడా కలుపుకుంటే చాలా చర్యలు చేపట్టవచ్చు. ఇక కరోనా ఆర్థిక వ్యవస్థపై చూపిన పరోక్ష ప్రభావాన్ని అంచనా వేద్దాము. తెలంగాణ భారత దేశంలో ధనవంతమైన రాష్ట్రంలలో ఒకటి.

గ్రోత్‌ ‌రేట్‌ ‌పరంగా చూసినా, తలసరి ఆదాయం పరంగా చూసినా గత 3 సం.లుగా మొదటి 8 స్థానాలలోనే ఉంటుంది. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే కరోనా వలన వ్యవసాయ రంగంలో ఎక్కువ ప్రభావం పడలేదు. ముఖ్యంగా వ్యవసాయం గ్రామీణ వ్యవస్థకి చెందినది అయి ఉండటం, కరోనా వ్యాప్తి రూరల్‌ ఏరియాలలో ఎక్కువగా లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ఈ రంగానికి ఎక్కువగా ఉండటం వలన ఎక్కువగా ప్రభావితం చెందలేదు. ముఖ్యంగా కరోనా వలన దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఋణాత్మక ప్రభావం పొందినది పారిశ్రామిక , సేవా రంగాలు.

మన దేశ జీడీపీలో, అయినా రాష్ట్ర జీఎస్‌ ‌జీడీపీలో ఆయినా ఈ రెండు రంగాల ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఈ రెండు రంగాలలో 40 రోజుల ఉత్పాదక కార్యకలపాలు నిలిచి పోయేసరికి ఆర్థిక వ్యవస్థ తప్పక మందగిస్తుంది, అది ఆర్థిక సత్యం. ఖచ్చితంగా ఉత్పాదకతపరంగా వచ్చే ఆదాయం ఇంకాస్త వెనక్కు వెళ్ళిపోతుంది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మన దేశానికి, మన రాష్ట్రానికి ఈ విధమైన ఆర్థిక మందగమనం చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వానికి ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి ఆర్థిక వ్యవస్థని నిలబెట్టడం కోసం ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. కానీ ఒక్క విషయం ఏంటంటే వ్యవస్థలోని జన ప్రాణాలను రక్షించడం కంటే వేరే ఏ బాధ్యత రాజ్యంకు ముఖ్యం కాదు. ఆర్థిక వ్యవస్థ అయినా, సామాజిక వ్యవస్థ అయిన, రాజకీయ వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజల కోసం తయారు చేయబడింది. జన సమూహం క్రమబద్ధంగా నడవడం కోసం ఏర్పడి వాళ్ళ జీవన విధానం నియమిత పద్దతిలో పెట్టడానికి మాత్రమే వ్యవస్థలు ఏర్పడ్డాయి. గురజాడ గారి వ్యాఖ్య  దేశమంటే మట్టి కాదోయ్‌ ‌దేశమంటే మనుషులోయ్‌ అన్నది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న భూభాగం దేశం అనబడదు, ఆ దేశ సరిహద్దుల్లో ఉన్న భూభాగం పైన నివసించే మనుషులనే దేశం ఉంటారు.

ఆదాయం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టడం ఇప్పుడున్న తీవ్ర పరిస్థితుల్లో అంగీకరించలేని చర్య. నిర్మాణ రంగం, మద్యం ఈ రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. మనుషులకు కూడా ఆదాయాన్ని, ఆనందాన్ని ఇచ్చేవి. సమస్య ఏంటంటే సమూహాలుగా మనుషులు అధికంగా గుమికూడేది కూడా ఇక్కడే. అది కరోనాకి అదృష్టం మనందరి దురదృష్టం. ఉదాహరణకు  ఇప్పటివరకు మద్యం ప్రభావం అది తాగిన వ్యక్తికి లేదా మద్యం తాగిన వ్యక్తి కుటుంబానికి మాత్రమే నష్టం జరిగేది. చాలా మంది వాదన ఏంటి అంటే ఇప్పటిదాకా కిరాణా షాపులు మెడికల్‌ ‌షాపులు  కూరగాయల మార్కెట్‌లు ఇవన్నీ తెరచి ఉన్న కరోనా నియంత్రణలోనే ఉంది కదా..అలాగే వైన్‌ ‌షాప్‌కి వెళ్లి మందు కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో తాగుతారు కదా దానివల్ల నష్టం ఏంటి, అది షాప్‌ ఇది షాప్‌ ‌కదా  అని ఒక మార్కెట్‌లో అమ్మకం కొనుగోలు కోణంలో చూస్తున్నారు. నిజమే ఆలోచిస్తే ఇది కరెక్టే కానీ ఒక కూరగాయల షాప్‌కి వెళ్ళిన వ్యక్తికి, మెడికల్‌ ‌షాప్‌కి వెళ్ళిన వ్యక్తికి పూర్తిగా తన పైన స్వీయ నియంత్రణ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మద్యం షాప్‌కి వెళ్తున్నాడు అంటే ఆ నియంత్రణ ఉంటుందా లేదా మనం గమనించవచ్చు. ఒకవేళ తాగి వస్తే తాగి వచ్చిన వ్యక్తి సానిటైజ్‌ ‌చేసుకుని ఇంట్లోకి రాగలిగే స్థితిలో ఉంటాడా..అన్నది గమనించాల్సిన అంశం.తాగితే జరిగే అన్ని రకాల చెడు, హింసా సంఘటనలకు ఈ కరోనా కాలం లో ఎంతవరకు కట్టడి చేయగలము..ఆలోచించాల్సిన అంశం.అన్నిటి కంటే ముఖ్యంగా సడలింపుల వలన కరోనా తగ్గిపోయింది అనుకునే నిరక్షరాస్యత, అవగాహన లేమి ఉన్న ప్రజలు ఇదివరకు చేపట్టిన ఏ చర్యలు ఇకపై పాటించరు. ఇప్పటికే రోడ్ల మీద చాలా మంది మాస్కులు లేకుండా గుంపులుగా తిరగడానికి గమనించవచ్చు. ఆర్థిక వ్యవస్థ ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా అన్న మీమాంసలో ప్రభుతం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రోటోగారస్‌ ‌పారడాక్స్,..‌దీనికి సమాధానం చెప్పలేము. ఇంకా ఈ చర్యల ప్రభావం రానున్న 10 రోజులలో పూర్తిగా కన్పిస్తుంది.

40 రోజుల తపస్సు భగ్నం అయిందా…
తప్పని ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం చేతులేత్తిసిందా..లేదా ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి తామే స్వీయ నియంత్రణ పాటించి కరోనాను ఎదుర్కోగలరు అనే నమ్మకం వచ్చిందా…ఏంటో తెలియదు. కానీ ఈ చర్యల ఫలితాన్ని మాత్రం ఖచ్చితముగా ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సామూహిక వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. బాధ్యత గల పౌరులుగా ఎవరి ప్రాణాన్ని వారే కాపాడుకుంటూ స్వీయ నియంత్రణను పాటిద్దాం. ఆరోగ్యాన్నీ, ఆర్థిక వ్యవస్థని కాపాడుకుందాం..జై హింద్‌.

శ్రావణ సంధ్య 

Leave a Reply