Take a fresh look at your lifestyle.

దిల్లీ ‘పోగ్రోమ్‌‘ ‌జరిగి సంవత్సరం..

“పోలీసుల సమక్షంలో ‘‘ఎన్‌ఆర్‌సీ ,సిఎఎ వ్యతిరేకత అంటూ రోడ్లమీదకు ఎవరైనా వస్తే ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్‌ ‌ట్రాంప్‌ ‌భారత్‌ ‌పర్యటనలో వున్నారు. ట్రాంప్‌ అమెరికా చేరుకున్న తరవాత మీ అంతుచూస్తాం’’ అని ఒక మతం ప్రజానీకాన్ని భయ పెట్టేలాగా ప్రకటించారు. ఈయన పైన ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలు శూన్యం.. ప్రస్తుత సమయంలో అంటే ఢిల్లీ మత హింస ‘‘పోగ్రోమ్‌’’ ఏడాది పూర్తీ చేసుకున్న సందర్బంగా మళ్ళీ కపిల్‌ ‌మిశ్రా ఇలా ప్రకటించారు ‘‘ ఇప్పుడైనా రోడ్లు బ్లాక్‌ ‌చేసి ప్రజలను పనికి వెళ్లనీయకుండా, పిల్లలు పాఠశాలకు వెళ్ళకుండా అడ్డుకుంటే వెంటనే మళ్ళీ రంగంలోకి దిగుతా’’.

aruna
అరుణ ,న్యూ దిల్లీ

రష్యన్‌ ‌పదం ‘‘పోగ్రోమ్‌’’ ‌ను 1882లో మొట్టమొదటిసారిగా ప్రజలు వాడుకలోకి తెచ్చారు. ఈ పదం అర్ధం ‘‘నాశనం చేయడం, వినాశనం చేయడం, హింసాత్మకంగా దాడి చేయటం’’. ఈ పదం ఎంత భయంకరమైనదో ఈశాన్య ఢిల్లీ వాసులకి తెలుసు. ఎందుకంటే ఈశాన్య ఢిల్లీ వాసులు గత ఏడాది ఇదే సమయంలో రాజ్యం కనుసన్నల్లో జరిగిన ‘‘పోగ్రోమ్‌’’ ‌కి బలి అయ్యారు. గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత హింస అల్లర్లలో సుమారు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు, తమ దైనందిన జీవితానికి ఉపయోగపడే గ్యాస్‌ ‌సిలెండర్‌, ‌పరుపులు వంటసామాను,ఇంటి సామాను, వంటి కనీస అవసరాలు తీర్చే దైనందిన అవసరం అయిన వస్తువులతో పాటుగా..ఆడపిల్ల పెళ్ళికి దాచుకున్నది.. బిడ్డ చదువుకి సమకూర్చుకున్నది.. మత హింస అగ్నికి దగ్ధం కాగా చెప్పనలవి కానీ నష్టం చవి చూసారు.

- Advertisement -

గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన ‘‘పోగ్రోమ్‌’’‌లో నమోదైన కేసులు 755 కాగా అందులో 407 కేసులు పోలీసు దర్యాప్తు లేకుండా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అల్లర్లల నేపథ్యంలో 348 కేసులలో పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. 1,569 మందిపై అనుమానాలు ఉన్నాయి అని ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేసారు. పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం,ఢిల్లీ హింసాత్మక అల్లర్లకు సంబంధించి మొత్తం 1,818 మందిని అరెస్టు చేశారు.వారిలో 1,165 మంది ఇంకా జైలులో ఉండగా 652 మందికి బెయిల్‌ ‌దొరికింది. 407 కేసులలో, ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది అని వీటిలో కొన్ని ఇంకా అరెస్టు చేయలేదు అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. 755 కేసులలో 62 ప్రత్యేక కేసులను ఢిల్లీ పోలీస్‌ ‌క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌) ‌దర్యాప్తు చేస్తున్నాయి. సిట్‌ ‌దర్యాప్తులో ఉన్న 62 కేసుల్లో 46 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 86 మంది నిందితులకు బెయిల్‌ ‌మంజూరు చేశారు.

సిసిటివి ఫుటేజ్‌ ‌విశ్లేషణ చేసేందుకు వీడియో అనలిటిక్స్,‌ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌సిస్టమ్‌ను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. రోడ్లపై ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల 945 సిసిటివి ఫుటేజ్‌ ‌వీడియో రికార్డింగ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో తీసిన వీడియో రికార్డింగ్‌లు, మీడియా హౌస్‌ల నుంచి పోగు చేసిన వీడియో ఫుటేజ్‌ ‌లను వీడియో ఎనలిటిక్‌ ‌టూల్స్, ‌ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌సిస్టమ్‌ ‌సహాయంతో విశ్లేషించాం అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అల్లర్లకు కారకులు అయిన వారిని బాగా గుర్తించడానికి సిసిటివి చిత్రాలను మెరుగు పరిచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌ను కూడా ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇ-వాహన్‌, ‌డ్రైవింగ్‌ ‌లైసెన్స్ ‌డేటాబేస్లను కూడా గుర్తించటం కోసం ఢిల్లీ పోలీస్‌ ఉపయోగించారు.

గత ఏడాది ఫిబ్రవరి 23 న, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక అల్లర్లు చెలరేగి ఫిబ్రవరి 25 వరకు కొనసాగాయి. దేశ రాజధానిలో కర్రలు, రాడ్లతో సాయుధ దుండగులు కలయ తిరుగుతూ, వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ప్రార్థనా స్థలాలతో సహా ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి దుర్మార్గాన్ని చేసారు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్‌ ‌చేసిన నాయకుడు కపిల్‌ ‌మిశ్రా పేరు మారుమోగిపోయింది.కారణం ఏమనగా ఇతను పోలీసుల సమక్షంలో ‘‘ఎన్‌ఆర్‌సీ ,సిఎఎ వ్యతిరేకత అంటూ రోడ్లమీదకు ఎవరైనా వస్తే ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్‌ ‌ట్రాంప్‌ ‌భారత్‌ ‌పర్యటనలో వున్నారు. ట్రాంప్‌ అమెరికా చేరుకున్న తరవాత మీ అంతుచూస్తాం’’ అని ఒక మతం ప్రజానీకాన్ని భయ పెట్టేలాగా ప్రకటించారు. ఈయన పైన ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలు శూన్యం.. ప్రస్తుత సమయంలో అంటే ఢిల్లీ మత హింస ‘‘పోగ్రోమ్‌’’ ఏడాది పూర్తీ చేసుకున్న సందర్బంగా మళ్ళీ కపిల్‌ ‌మిశ్రా ఇలా ప్రకటించారు ‘‘ఇప్పుడైనా రోడ్లు బ్లాక్‌ ‌చేసి ప్రజలను పనికి వెళ్లనీయకుండా, పిల్లలు పాఠశాలకు వెళ్ళకుండా అడ్డుకుంటే వెంటనే మళ్ళీ రంగంలోకి దిగుతా’’.

Leave a Reply