Take a fresh look at your lifestyle.

పంచాయితీ తొలిదశలో వైకాపాదే హవా

  • వైకాపా సంక్షేమ పథకాలే విజయం సాధించి పెట్టాయి
  • మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల

‌పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు హుందాగా అంగీకరించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో 81 శాతానికిపైగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారని తెలిపారు. ఓటమిని కూడా కొందురు వేడుక చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరిస్తే బాగుంటుందని అన్నారు.

పార్టీ మద్దతుతో విజయం సాధించిన అభ్యర్థుల ఫొటోలను సాయంత్రానికి వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫలితాల్లో తప్పులున్నట్లు చూపితే సరిచేసుకుంటామని సూచించారు. అమరావతి ప్రాంతంలోనూ వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. అందరు ఊహించినట్లే ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టంకట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తొలిదశ పంచాయతి ఎన్నికల్లో 2,637 వైఎస్సార్సీపీ మద్దతు దారులు విజయం సాధించారన్నారు. పచ్చ వి•డియా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాస్తున్నా, ప్రజలు అధికారపార్టీ వైపే నిలిచారన్నారు. అందుకు 80 శాతానికి పైగా స్థానాలను వైఎస్సార్సీపీ పార్టీ క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసిందన్నారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ వెంటిలెటర్‌పై ఉందని, రాజ్యంగబద్ధ పదవిలో ఉండికూడా నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని సజ్జల విమర్శించారు.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎంత ఇబ్బంది పెట్టినా ఎవరు భయపడలేదన్నారు. జగన్‌మోహన్‌ ‌రెడ్డి సంక్షేమ పథకాలు, కొవిడ్‌ ‌లాంటి విపత్తును ఎదుర్కొవడంలో జగన్‌మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు కల్పించిన భరోసానే ఎక్కువ స్థానాలు గెలవడానికి కారణమన్నారు. కొన్ని పచ్చవి•డియాలు బ్యానర్‌లో టీడీపీకి అనుకూలంగా రాసినప్పటికి, లోపల మాత్రం 80 శాతం వైఎస్సార్సీపీ , 20 శాతం టీడీపీ గెలిచాయని రాశాయన్నారు. వీరి తీరు మేకపోతు గాంభీర్యంలా ఉందన్నారు. దేవినేని ఉమా నియోజక వర్గంలో టీడీపీని ప్రజలునమ్మే స్థితిలో లేరన్నారు.

జగన్‌మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ద్వారానే ప్రజలకు చేరువైందని అన్నారు. రానున్న40 రోజులు ఏంచేయాలో తమవద్ద ప్రణాళిక ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజ్యంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేయోద్దని టీడీపీకి హితవు పలికారు. వెన్నుపోటుకు పెటెంట్‌ ఉన్న బాబు, జగన్‌మోహన్‌ ‌రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

Leave a Reply