- ఏమాత్రం ప్రభావం చూపని టీడీపీ
- ప్రశాంతంగా ముగిసిన తొలిదశ పోలింగ్
- ఏపీలో పంచాయతీ పోరుకు భారీ స్పందన
- 82 శాతం పోలింగ్ నమోదుు
పలుచోట్ల ప్రలోభాలకు తెర..పట్టుకున్న పోలీసులు
ఆది నుంచి అనేక ఆశలు పెట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఎక్కడా ఆశించిన విధంగా ఫలితాలు కనబరచలేక పోయింది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను చంద్రబాబు, ఆయన పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఎన్నికలను వైసీపీకి, ముఖ్యంగా జగన్‌కు రిఫరెరడంగా చంద్రబాబు ప్రచారం చేశారు. అదేవిధంగా వారు చూశారు కూడా. ఈ క్రమంలోనే నిత్యం వి•డియాలోను, జూమ్ యాప్‌లోను తమ్ముళ్లకు .. దిశానిర్దేశర చేశారు.
అంతేకాదు.. 24/7 అందుబాటులో ఉండే కాల్ లైన్‌ను కూడా ప్రవేశ పెట్టారు. ఇక, న్యాయ సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోటీలో దింపేందుకు యువతను కూడా సవి•కరించారు. ఇక, ఎస్ ఈసీ దన్నుగా ఉందనే వ్యాఖ్యలు కూడా టీడీపీ విషయంలో ఉన్నాయి. ఇదిలావుంటే.. సామాజిక వర్గాలను ఏకం చేసేందుకు, టీడీపీ వైపు తిప్పుకొనేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారు. అదేసమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఎవరూ సుఖంగా లేరనే టాక్ తీసుకువచ్చారు. దీనికితోడు ప్రభుత్వ వైఫల్యాలంటూ.. నిత్యం వి•డియాలో సమావేశాలు నిర్వహించారు.
ఇక, ఇన్ని చేసినా.. తాజాగా ఫలితాల్లో టీడీపీ ఎక్కడా పుంజుకున్న పాపాన పోలేదని సొంత పార్టీ నేతలే విమర్శించే పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా.. పోలీసులు కూడా భద్రత కల్పించారు.