Take a fresh look at your lifestyle.

వైకాపా నేతల భూ దందా.. 400 కోట్ల భూకుంభకోణం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
చిత్తూరు,జూలై 3 : చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల భూ కబ్జాలు దారుణంగా ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఎక్కడిక్కడ ఆక్రమణలకు తెరలేపారని అన్నారు. ఇందులో పీలేరు కుంభకోణం విలువే 400 కోట్లని అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం లో భూ కుంభకోణం జరిగిందని కిశోర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకుని వైసీపీ నేతలు భూకబ్జాకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ భూములకు లే అవుట్లు వేసి అక్రమంగా అమ్మేస్తున్నారని కిశోర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఊర్లు, సర్వే నెంబర్ల వివరాలతో డియా ముందు కిశోర్‌ ‌ఫొటోలు బయటపెట్టారు.

జిల్లాలో భూ అక్రమాలపై సర్వే నెంబర్లు సహా త్వరలోనే బయటపెడతామన్నారు. భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. కొనుగోలు చేసిన భూములు చెల్లవని కోర్టులో వస్తే ప్రజలు నష్టపోతారన్నారు. మదనప్లలె, ఇతర ప్రాంతాలకు కూడా భూకుంభకోణం విస్తరించిందన్నారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని… అక్రమాలకు సహకరించిన అధికారులకూ భవిష్యత్తులో ఇబ్బందులేనని కిశోర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. దీనిపై అసవరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా అన్నారు.

Leave a Reply