Take a fresh look at your lifestyle.

ఎన్నికల్లో వైసిపి బెదిరింపు రాజకీయాలు

  • గత ఎన్నికల్లో డబ్బులు విదిల్చి గెలిచారు
  • తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బాబు

గత ఎన్నికల్లో డబ్బులు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఇటువంటి మాఫీయాను చూడలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఓటుతో వైసీపీని భూస్థాపితం చేయాలని చెప్పారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కరోనా సాకుతో జగన్‌ ‌తిరుపతి సభను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పలేని అసమర్థుడు ఈ జగన్‌రెడ్డి అని విమర్శించారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో గెలవడానికి వలంటీర్ల ద్వారా ప్రజలను భయపెట్టి వైసీపీ నాయకులు ఓట్లు పొందుతున్నారని టీడీపీ నేత నల్లారి కిశోర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఈ రోజు వి•డియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు పోకుండా వలంటీర్లతో వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. వలంటీర్ల ద్వారా ప్రజలను భయపెట్టి ఓట్లు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. వలంటీర్‌ ‌వ్యవస్థను పక్కన పెట్టి ఎన్నికలు జరపండి, వైసీపీ పరిస్థితి ఏంటో తెలుస్తుందని ఆయన సవాల్‌ ‌విసిరారు. ఉప ఎన్నికలలో గెలవడానికి రెండు లక్షల దొంగ ఓటర్‌ ఐడీ కార్డులు తయారు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. పద్ధతిగా ఎన్నికలు జరిగితే లక్ష ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి జీవితకాలంలో మంత్రి అయ్యి రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో జిల్లాకు ఆయన ఏ మంచి పని చేశారో చెప్పాలని నల్లారి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply