Take a fresh look at your lifestyle.

ఈటలను బహిరంగంగానే కలిశాం

  • అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు కెసిఆర్‌
  • ‌కెసిఆర్‌, ‌మోడీ ఇద్దరూ తోడుదొంగలు
  • దళితులను మోసం చేయడానికే దళిత బంధు
  • పథకంపై• కెసిఆర్‌కు చిత్తశుద్ది లేదు
  • హుజూరాబాద్‌ ‌ప్రచారంలో రేవంత్‌ ‌ఫైర్‌

ఈటల తనను రహస్యంగా కలిసాడని తనపై మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తాను బహిరంగంగానే కలిశానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. వేం నరేందర్‌రెడ్డి కొడుకు పెళ్లి పత్రిక సందర్భంగా నేతలందరం కలిశామన్నారు. మే 7న ఈ కార్యక్రమం గోల్కొండ రిసార్టులో జరిగిందన్నారు. ఈటలను తాను చీకట్లో కలవలేదన్నారు. కేసీఆర్‌ ‌కుట్రలను తనతో ఈటల చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌కాదా అని ఆయన ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చింది వి• కాంట్రాక్టర్‌ ‌కాదా అని రేవంత్‌ ‌నిలదీసారు.

అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు సిఎం కెసిఆర్‌ అని, హుజూరాబాద్‌లో మరోమారు మోసం చేయడానికే దళితబంధును తెచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దళిత బంధుతో దళితుల వోట్లు కొల్లగొట్టాలని చూశారని, గతంలో దళిత సిఎం అంటూ మోసం చేసింది నిజం కాదా అని అన్నారు. అలాగే మూడెకరాలు ఇస్తానని మొండి చేయిచూపి మళ్లీ ఏ మొహం పెట్టుకుని వొస్తాడని అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక ముగిసిన తరవాత దళితబంధుకు కూడా చాపచుట్టేస్తాడని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు వోట్లు అడిగే అర్హత లేదని అన్నారు. కేసీఆర్‌, ‌మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని ఆరోపించారు.

కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హావి•లను కేసీఆర్‌ అమలు చేయలేదని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్‌ ‌కలిసి పెట్రో ధరలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లు జోడు గుర్రాల్లా ఈటల-హరీష్‌రావు తిరిగారని విమర్శించారు. ఇప్పుడు తనకు, ఈటలకు పడటం లేదని హరీష్‌రావు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.  ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్యూరి వెంకట్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply