Take a fresh look at your lifestyle.

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే చెల్లించాలి

  • రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమచేయండి
  • సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును వెంటనే రైతులకు చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ ‌చేశారు. యాసంగిలో ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాల్లోనే రైతుల నుంచి కొన్న వడ్లకు రూ.517.16 కోట్లను ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్షించి పరష్కరించాలని, ఖరీఫ్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు. యాసంగి పూర్తయినా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌రైతులకు ఇంకా డబ్బులు చెల్లించలేదని బండి సంజయ్‌ ఆరోపించారు. అమ్ముకున్న పంటలకు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఇకనైనా వారి సమస్య పరిష్కరించా లంటూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. అలాగే వానాకాలం మొదలైనందున రైతుబంధు నిధులు కూడా అన్నదాతల ఖాతాలో వేయాలని కోరారు.

- Advertisement -

రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ ‌చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెంటనే ఫామ్‌హౌజ్‌ ‌నుంచి బయటకి వచ్చి రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై సమీక్షించాలని కోరారు. ఖరీఫ్‌ ‌సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతుసంఘాలతో, అన్నీ రాజకీయ పార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌ ‌ప్రారంభమైనందున రైతులకు రైతుబంధు నిధులు వెంటనే చెల్లించాలని లేఖలో కోరారు.

Leave a Reply