Take a fresh look at your lifestyle.

వటపత్ర సాయిగా స్వామివారి దర్శనం 

 యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత్ర సాయి సందర్శనం నయనానందకరంగా సాగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వేద పండితులు వేద పఠనంతో, అర్చకుల మంత్రోచ్ఛారణలతో, ఋత్విక్కుల వేద పారాయణలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనులు స్వామివారికి జయజయ ధ్వానాలు పలికారు .నిత్య ఆరాధన అనంతరం ఆలయ స్థానాచార్యులు, ప్రధానాచార్యులు, యజ్ఞ చార్య బృందం, ఆలయ అర్చక బృందం, పారాయణకులు వటపత్రశాయిగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. సాయంకాలం బాలాలయంలో స్వామి వారిని పొన్న వాహన సేవలో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీత, ఆలయ పర్యవేక్షకులు, సహాయ నిర్వాహకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు.

Leave a Reply