Take a fresh look at your lifestyle.

నేటి నుంచి కన్నుల పండుగగా.. భక్తులకు యాదాద్రి నారసింహుని దర్శనం

  • నేటి మహాకుంభ సంప్రోక్షణతో పూర్తికానున్న ఉద్ఘాటన క్రతువు
  • సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్న స్వామి
  • ఆరేళ్ల నిరీక్షణకు తెరపడుతున్న వేళ
  • సకల శిల్పకళా కౌషలంతో రూపుదిద్దుకున్న యాదాద్రి దివ్య క్షేత్రం
  • సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం
  • ఉదయం 11.55 నుంచి భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనం
  • నేటి క్రతువులో పాల్గొననున్న సిఎం కెసిఆర్‌

యాదాద్రి భువనగిరి, మార్చి 27(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నేటి నుంచి పునః ప్రారంభం అవుతున్నది. ఆరున్నరేండ్లుగా కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్న స్వయంభువుల దర్శన భాగ్యం కలగనుంది. ప్రపంచంలో నలు దిక్కులా చాటేలా యాదాద్రి పునః నిర్మాణం పూర్తి అయింది. నేడు శుభ ముహర్తంలో మహా కుంభ సంప్రోక్షణ అనంతరం కోట్లాది మంది కొంగు బంగారమైన శ్రీ లక్ష్మినరసింహా స్వామి ప్రధానాలయ ద్వారాలు తెరుచుకొనున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుండి భక్తుల దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వేదపండితులు నిర్ణయించిన మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 21 నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో వైభవంగా పంచకుండాత్మక మహాయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుల దర్శనాలు నేటి నుండి మొదలవుతాయి. ఆరున్నర సంవత్సరాలుగా భక్తకోటి ఎప్పుడెప్పుడా ! అని ఎదురుచూస్తున్న స్వామి వారి అపురూప దర్శనం నేడు 11:55 గంటలకు పునః ప్రారంభం కానుంది. ప్రత్యేకంగా ఆలయ పునర్నిర్మాణంలో ఉండే సమస్త వాస్తు దోషాలు, క్షేత్ర దోషాలు, మాన, ఉన్మాన, ఉపమాన, లంబమానాది దోషాలు, తొలగి పోవడానికి మహావాస్తు, శాంతి పూజను నిర్వహించనున్నారు. ఇది అతి శక్తివంతమైన బలమైన పూజా కార్యక్రమమని ఆలయ ప్రధాన అర్చకుడు నల్లన్‌ ‌థీఘళ్‌ ‌లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు.


యాగశాలలో….
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రతిరోజు యాగశాలలో మూలమంత్ర మూర్తి, మంత్ర జపాలు హవన విధి విధానాలు జరిగాయి. ఉదయం, సాయంత్రం ప్రత్యేకమైన హోమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం యాదాద్రీశుడికి సుమారుగా 11 కోట్ల లక్ష్మీ నృసింహ మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలను  వైభవంగా నిర్వహించారు. నెలకు కోటి జపం చేపట్టాలని ప్రత్యేకమైన ప్రాజెక్టును నిర్వహించామని తెలిపారు. ఈ మూల మంత్ర మూర్తి మంత్ర జపాలన్ని కూడా మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని అర్చకులు వివరించారు. నేటి వరకు ఎనిమిది కోట్ల జపం పూర్తయినట్లువారు  వెల్లడించారు మొత్తంగా 11 కోట్ల జపం చేయాలన్నది మహా సంకల్పం అని తెలిపారు. 11 కోట్ల లక్ష్మీ నృసింహ మూలమంత్ర జపం చేయించడమే ఈ యజ్ఞం లోని మహా విశేషం అన్నారు. దాంతో యాత్రలకు మహా బలం చేకూరుతుందని, ఈ యాత్ర బలంతోనే భక్తులకు స్వామివారు అభయ వరప్రదానం చేస్తారు.

 నేడు మహాకుంభ సంప్రోక్షణ..
ప్రధానాలయ పునః ప్రారంభంలో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామివారి దివ్య విమాన శిఖరానికి కుంభ సంప్రోక్షణాభిషేక మహాసంకల్పం చేసి ఉదయం 11 : 55 గంటలకు మిథున లగ్న సుమ ముహూర్తాన భక్తులకు యాదాద్రి దేవస్థానాన్ని అంకితమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎవరు ఇవ్వలేని గొప్ప భక్తి కానుక ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇవ్వబోతున్నారు. ప్రజలందరికీ స్వయంభువుల దివ్య దర్శనాన్ని అపాదింప జేస్తారు. కృష్ణశీలలతో నాణ్యతతో దర్శనీయంగా ప్రతిష్ట కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి.  మంత్రం అనేది మహా ప్రయోగంగా, పరమ ప్రశాంతంగా, శక్తివంతంగా, మంత్రశక్తి సమన్వితంగా ప్రతిష్టాపన చేపట్టారు.

నేడు సిఎం కేసిఆర్‌ ‌శ్రీ యాదాద్రి నృసింహుని దర్శనానికి రాక
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహా సంప్రోక్షణ పూజలు అత్యంత వైభోపేతంగా మార్చి 21 నుండి 28 వరకు జరిగాయి. గత ఐదు రోజుల నుండి ఈ పూజలందుకుంటున్న నరసింహుడు నేటి నుండి ప్రత్యక్షంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. నేడు రాత్రికి కుటుంబసమేతంగా యాదాద్రికి సీఎం కేసీఆర్‌ ‌చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Leave a Reply