Take a fresh look at your lifestyle.

తుది దశకు యాదాద్రి విస్తరణ పనులు త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు

ఇటీవలే ఇఎం కెసిఆర్‌ ‌యాదాద్రిలో పర్యటించి ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టారు. అలాగే మరోమారు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు యాదాద్రి విస్తరణకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగా సాగుతున్నాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ ‌రావు అన్నారు. ఆలస్యం అయినా పనులు పక్కాగా సాగుతున్నాయని అన్నారు. దీని నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అద్భుత ఆలయంగా నిలిచిపోతుందని అన్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు చినజీయర్‌ ‌స్వామి సూచనల మేరకు నిర్మాణ పనులు సాగుతున్నాయని అన్నారు.

ఇటీవల సిఎం కెసిఆర్‌ ‌సూచించన మేరకు పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. త్వరగా వాటిన ఇపూర్తి చేసి ప్రారంభోత్సవానికి యాదాద్రిని సిద్దం చేస్తామని అన్నారు. యాదాద్రిని దివ్యమనోహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమం చేశారు. యాదగిరిగుట్టను మరో తిరుమలగా మారుస్తానని చెప్పింది మొదలు ఇప్పటికే పదిసార్లు యాదాద్రిని సందర్శించి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దివ్యమనోహరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు పనులు సాగుతున్నాయి.

ఓ వైపు బ్రహ్మోత్సవాలు..మరోవైపు తుది మెరుగులతో యాదాద్రి నిత్యనూతనంగా వెలుగొందుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి నున్నాయి. దేశంలోనే అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఈ ఏడాది మే వరకు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సిఎం కెసిఆర్‌ ‌కలల ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకుంటున్న తీరు అద్భుతంగా ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏమాత్రం జాప్యం లేకుండా సమాంతరంగా చేపట్టాల్సిన పనులు పూర్తి చేస్తేనే ప్రధాన ఆలయం పనులతో పాటు కొండపై భక్తులకు కనీస సదుపాయాలు సమకూరుతాయని భావిస్తున్నారు.

ఇవికాకుండా మిషన్‌ ‌కాకతీయ ద్వారా యాదాద్రి చుట్టుపక్కల చెరువులను అభివృద్ధి చేశారు. మిషన్‌ ‌భగీరథతో యాదాద్రికి మంచినీటి సౌకర్యం కల్పించే పనులు చేపట్టారు. గండిచెరువులో ఎప్పుడూ నీళ్లు ఉండేవిధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ పూర్త ఇచేయడంతో ఈ వేసవిలో అద్భుత ఆలయం సాకారం కానుంది.

Leave a Reply