20 రోజుల్లో రూ. 2 కోట్ల పైగా రాబడి
యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జనవరి3: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 167 గ్రాములు రాగా, వెండి 2 కిలోల 600 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. క అమెరికా డాలర్లు 1194, యూఏఈ దిర్హామ్స్ 140, ఆస్టేల్రియా డాలర్స్ 150, ఇంగ్లండ్ పౌండ్స్ 30, కెనడా డాలర్స్ 45, ఒమాన్ బైసా 10,500, న్యూజిలాండ్ డాలర్స్ 45, సింగపూర్ 74 డాలర్స్, మలేషియా రింగ్గిట్స్ 69, సౌదీ రియల్స్ 27 వచ్చాయి.