Take a fresh look at your lifestyle.

యాదాద్రి బాలాలయంలో భక్తులకు దర్శనాలు

*ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు
‌రాష్ట్రంలో సుప్రసిద్ద యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో దర్శనాల కోసం దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో కంటైన్మెంట్‌ ‌జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ నెల 8 వ తేదీ నుంచి అన్ని ప్రార్ధనా మందిరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో.. ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. మొదటి రోజు నుంచే ఆర్జిత పూజలు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. దీనికితోడు భౌతికి దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై దేవాదాయ శాఖ కవి•షనర్‌ను అనిల్‌కుమార్‌ను కలిసి యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌ ‌గీత చర్చించారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. కొండ కింద నుంచి భక్తులు కాలినడకన కొండపైకి చేరుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని, అనుమతి వచ్చేలోగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత వి•డియాకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు దర్శనాల పక్రియ ఉంటుందని తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి శ్రీవారి దర్శనాలు నిలిచిపోవడంతో భక్తులు 78 రోజులుగా తమ ఇష్టదైవాన్ని దర్శించుకొనే అవకాశం కోల్పోయారు. ఈ నెల 8న ఆలయం తెరుచుకోనుండటంతో దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో కొండపైన ధర్మ దర్శనాల క్యూలైన్లలో భౌతిక దూరం పాటిస్తూ భక్తులు నిలబడేందుకు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్జిత దర్శనాలు లేకుండా కేవలం ధర్మ దర్శనాలకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించారు. రూ.150, రూ.50 టిక్కెట్‌ ‌దర్శనాలు ప్రస్తుతానికి ఉండవనపి ఆలయ అధికారులు తెలిపారు. బాలాలయంలోనికి భక్తులు వెళ్లి బయటకు వచ్చే సమయంలో ఒకరికి మరొకరు ఎదురుపడి తాకే అవకాశం ఉన్నందున బాలాలయంలోని ద్వారం వద్ద నుంచే నరసింహుడిని దర్శించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నారసింహుడి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు విధిగా మాస్క్ ‌ధరించి రావాలని ఆలయాధికారులు భక్తులను కోరుతున్నారు. శానిటైజర్లు కూడా వెంట తెచ్చుకోవచ్చని సూచిస్తున్నారు. గర్భాలయంలోకి అనుమతి లేకుండా లఘు దర్శనం మాత్రమే ఉంటుందని ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌ ‌తెలిపారు.

Leave a Reply