‘‘పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు’’……
సదివినోళ్ళందరు మీ ఇమానంగ జెప్పుండ్రి!మీకేం యాదికచ్చింది!?
గుండెలకేలి పాయిరంగ తీషిన యాది
విక్ర మార్కుని బొమ్మ!
కాదని యెవలన్న అంటరా!
కొందరు ఎంత మరిశిపొయినా యాదికుంటరు. కొందరు ఎంత యాదికుండాలని అనుకుంటె సుత యాదికుండరు. బతికుండంగ జేషే పనులే గాళ్ళ యాదిని మన గుండెలల్ల పైలంగ దాషిపెడ్తది. శంకర్ అనే శివశంకరన్ ‘‘చందమామ’’ పిలగాండ్ల బొమ్మల పుస్తకం యాదికున్నంత కాలం మన గుండెలల్ల నిలిషిపోయే గొప్ప మనిషి. ఏడందల భేతాళ కతలకు బొమ్మలేషి చందమామను మబ్బుల్ల ఎలుగు లాగ మెరిపిచ్చిండు. అసోంటి మనిషి జీవిడిండని తెలిషినంక అయ్యో! అని బాద పడి గుడ్లల్ల నీళ్ళుతీసుకోని తెలుగోళ్ళు లేరు. చందమామను మన గుండెల గంతగనం పైలంగ దాషిపెట్టింది అండ్ల కానచ్చే బొమ్మలేనాయె!గవి గీషే టీవీ ఆచార్య, చిత్రా,వడ్డాది పాపయ్య, శంకర్ సార్లల్ల ఈ కాలం దాంక మనతోటి మిగిలింది శంకర్ సార్ ఒక్కలే! ఆయన సుత మనకు దూరమయిండు. శంకర్ సారు గురించి ఒక్క ముక్కల జెప్పాలంటె ఒక్క విక్రమార్కుని బొమ్మ సాలు.
శంకర్ సారు నుంచి క్షమాపణలు కోరుతూ…..