Take a fresh look at your lifestyle.

ఇం‌కెంతకాలం రైతుల పడిగాపులు?

  • ధాన్యం కొనుగోలులో ఆలస్యమెందుకో..?
  • గోనెసంచులు సరిపడు రాక ఇబ్బందులు
  • రోజుకు ఒకటి రెండు లారీలు మాత్రమే
  • మిల్లులకు తరలింపు
  • ఆకాల వర్షం వస్తే పరిస్థితేంది?
రామన్నపేట/పోచంపల్లి/వలిగొండ : రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఐకేపి కేంద్రానికి తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయడంలో ఆలస్యం అవుతుంది. 20రోజుల నుండి ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేలపి వచ్చిన రైతులకు నిరాశే మిగిలింది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఎండలో నిరీక్షిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తు న్నారు. ఆయా మండలాల ఐక్షేపి కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని అమ్ముకు నేందుకు వచ్చే రైతులు నానా అవస్థలు పడుతున్నారు. 20రోజుల కింద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేచపికి రైతులు తమ ధాన్యాన్ని అమ్మడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా రైతులకు నిరాశే మిగులుతుంది.
కొనుగోలు కేంద్రాలకు గోనెసంచులు సరిపడు రాకపోవ డంతో ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం ఏర్పడుతుంది. దీంతో రోజుకు ఒకటి, రెండు లారీలు మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారు. దీనికి తోడు ఆకలవర్షాలు పడే పరిస్థితులు ఉండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రామన్నపేట మండలంలో 11 ఐకే•పి కేంద్రాలల్లో ఇప్పటివరకు దాదాపు 1650 రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలల్లో పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 850మంది రైతుల ధాన్యం 257485 బ్యాగులు కొనుగోలు చేశారు. పోచంపల్లిలో : మండలంలో మొత్తం 14 ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు 885 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విక్రహించిన రాయితీలు బ్యాంకులో డబ్బులు జమవుతున్నాయి. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు అధికంగా కాంటాలు చేయాలని రైతులు కోరుతున్నారు. వలిగొండ : 20 ఐకేపి కేంద్రాలు ఉండగా అందులో 440మంది రైతుల ధాన్యం నిల్వ ఉన్నది.
ఐకెపి కేంద్రాల్లో వసతులేవి?
image.png

గరిడేపల్లి, మే 4(ప్రజాతంత్ర విలేకరి) : మండలంలోని ఐకెపి కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు, సౌకర్యాల్లేకపోవడంతో రైతులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగు తునండటంతో ఆ ఎండలోనే పనులు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సేద తీరడానికి టెంట్లను సైతం వేయకపోవడంతో అవస్థలెదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి దృష్ట్యా కనీసం హమాలీలకు మాస్క్‌లు కూడా అందించలేదని వాపోతున్నారు. సంఘబంధం మహిళలు ఐకెపి కేంద్రాలను సమర్థనీయంగా నిర్వహిస్తున్నప్పటికీ వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తక్షణమే మౌళిక సదుపాయాలు కల్పించాలని రైతులు డిమాండ్‌ ‌చేశారు.
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

image.png

ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చినా నేటికీ కొనుగోలు చేయలేదని పురపాలక కేంద్రా నికి చెందిన రైతు గోరిగే లింగ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగో లును ఆలస్యం చేయడంతో ధాన్యం రాశులపై కప్పేందుకు పట్టాల భారం పెరుగు తుందని, చిరిగి పోయిన గాన్ని సంచులతో ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతున్నాను.
– గోరిగే లింగస్వామి,  రైతు, పోచంపల్లి
కొనుగోలు వేగవంతానికి చర్యలు

image.png

మండలంలోని ఐకేపీ ధా న్యం కొనుగోలు కేంద్రా ల లో దాన్యం కొనుగోలు వేగ వంతానికి చర్యలు తీసుకుం టామని ఎపిఎం అంజయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు కొరత ఉన్నది వాస్తవమే అయినప్పటికి అవసరం ఉన్న చోట అధికారులతో సంప్రదించి తెప్పిస్తున్నాం. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా కొనుగోలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 258424 బ్యాగులో ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.
–  అంజయ్య, రామన్నపేట ఏపిఎం

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!