Take a fresh look at your lifestyle.

ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలి

పదవ తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని నాగర్‌ ‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని లహరి గార్డెన్‌ ‌లో నాగర్‌ ‌కర్నూల్‌ ‌మండలంలోని 13 పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఒకరోజు ప్రేరణ తరగతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను గురువులను ప్రేమిస్తూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలని అన్నారు.తల్లిదండ్రులే మనందరికీ నిజమైన హీరోలని తల్లిదండ్రులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలిపారు.తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.అనుకున్నది సాధించాలంటే కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలన్నారు.

జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తన వంతు గా ఏదో ఒక సహకారాన్ని అందించే మనస్తత్వం ప్రతి ఒక్కరు అవలంబించు కోవాలని అన్నారు.ఈ సంవత్సరం తన నియోజకవర్గ పరిధిలో పాఠశాలల్లో మౌలిక వసతుల పైనే ప్రత్యేక శ్రద్ధ చూపుతానని విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు.తన నియోజకవర్గంలో పదో తరగతిలో 10/10 జిపిఏ సాధించిన విద్యార్థులు అందరికీ ల్యాప్‌ ‌టాప్‌ ‌లు ఇస్తానని అన్నారు.ఈ ఓరియెంటేషన్‌ ‌తరగతులలో 13 పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 1078 మంది విద్యార్థులు ఈ ప్రేరణ తరగతులకు హాజరైనారని ఎమ్మెల్యే తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత టైం టేబుల్‌ ‌తయారు చేసుకుని సమయపాలన పాటిస్తూ పరీక్షలకు సిద్దం కావాలని అన్నారు. ఏ పరీక్ష అయిన ట్వంటి ట్వంటి మ్యాచ్‌ ‌లాంటిదని మనమీద మనకు ఆత్మవిశ్వాసం ఉంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. మనోధైర్యంతో పరీక్షలకు వెళ్లాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి సూచించారు.

written exam with confidence

సీఐ ఏడుకొండలు పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ కల్పించారు.ఈ సందర్భంగా ఆయన ఏ విధంగా పరీక్షలకు హాజరు కావాలో అవగాహన కల్పించారు.తల్లిదండ్రులను గౌరవించిన వారే జీవితంలో రాణిస్తారని అన్నారు.పరీక్షలంటే చదువుకున్న అంశాలను వ్రాయడమే అని తెలిపారు. డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో తొలిమెట్టు అని ప్రతి విద్యార్థి 10 లో రానిచ్చి ఉన్నత చదువులో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్‌ ‌పి టి సి శ్రీశైలం, మండల విద్యాధికారి అశోక్‌, ‌నోడల్‌ అధికారి కురుమయ్య, ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి ,స్ట్రాంగ్‌ ‌టీచర్‌ ‌వెంకటేశ్వర్లు శెట్టి, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఓపెన్‌ ‌స్కూల్‌ ‌కోఆర్డినేటర్‌ ‌నాగరాజు, ఎస్‌ ‌పి సి ప్రసాద్‌ ‌గౌడ్‌, 13 ‌పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy