Take a fresh look at your lifestyle.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి..

“మార్కులే ప్రతిభకు కొలమానాలు కాదు మార్కుల వేటలో పోటీ ధోరణులను తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలే రావద్దు. మార్కులే జీవితం కాదు మీరు జీవితంలో అనేక విజయాలు పొందాల్సి ఉంది. మీ బంగారు భవిష్యత్తుకై ఇష్టమైన రంగంలో శ్రమిస్తే గొప్పవాళ్ళుగా ఎదగవచ్చు. గొప్పవాళ్ల చరిత్రను చూస్తే… సచిన్‌ ఎన్నోసార్లు పరీక్షలు తప్పినా నిరాశ చెందకుండా తనకిష్టమైన క్రికెట్‌ను ఎంచుకుని రారాజుగా వెలుగొందాడు. ఐన్‌స్టీన్‌ ‌చిన్నప్పుడు మాటలు రాకపోయినా సృజనాత్మకంగా ఆలోచించి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇలా చాలామంది గొప్పవాళ్ళ చరిత్రల్లోకి వెళితే చదువులకంటే జీవితం ఎంతో విలువైందని తెలిసిపోతుంది. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ నిస్ప•హలకు లోనుకావద్దు.”

అక్షరానికీ, జీవితానికి తూకం వేసే పరీక్షాకాలం వచ్చేసింది. మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు. అవి అయిపోగానే పదో తరగతి పరీక్షలూ ఆ తర్వాత వచ్చే డిగ్రీ, పీజీ, ఉద్యోగ పోటీ పరీక్షలు ఇలా పిల్లల చదువులన• పరీక్షలతో కొలుస్తున్నాము. ఒత్తిడిని జయించడం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మోటివేటర్‌ (‌కౌన్సిలింగ్‌) ‌లు ఇలా అందరూ కలిసి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించవలసి ఉంది. అంతేకాదు వీటికి తోడు ప్రధానపాత్ర పోషించే మరో అంశం ఏమిటంటే.. ఏడాదంతా తరగతుల్లో విని, చదివి, వాటిని ఏకాగ్రతతో మళ్ళీ పున:శ్చరణ చేసుకుని వార్షిక పరీక్షలలో బాగారాసి మంచి మార్కులు సాధించుకోవాలనే తపన విద్యార్థుల్లో ఉండాలి. అధికారులు పరీక్ష నిర్వహణ సౌకర్యాలతోపాటు మంచి వాతావరణం కల్పిస్తేనే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఉత్సాహంగా పరీక్షలు రాస్తారు. గతేడాది కొన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటులో లోపం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలు పునరావృతం కాకుండా గుర్తించి పరిష్కరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని పాఠశాలలు, జూనియర్‌ ‌కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, పరీక్షలు రాయడానికి, కూర్చోవడానికి బల్లలువంటి సౌకర్యాలు లేవు. నేల మీదనే ఆరు•యటనే కూర్చోబెట్టి పరీక్షలు రాసిన సంఘటనలు కోకొల్లలు చూస్తిమి. భూతాపం కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ఈ ఏడాది మార్చి మొదటి వారం నుండే ఎండలు పెరుగుతున్నాయి. 45 డిగ్రీల ఊష్ణోగ్రతతో మార్చి నెల మండిపోనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా పాలకులు పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని గమనించాలి.

- Advertisement -

ఐదేళ్ళకు ఒకమారు జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్పటికి, ఎన్నికల సిబ్బంది, ఓటర్లు అరకొర సౌకర్యా లతో వోటు వేయాల్సి వస్తుంది.అవి దేశ, రాష్ట్ర పాలకులకు జన్మనిచ్చేవైతే, ఇవి ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్‌ను నిర్ణయించే• అతి కీలకమైనవి కాబట్టి పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి కొరత లేకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మదింపు నుండి ఫ•లితాల ప్రకటన వరకు నిర్వాహకులు, అధికారులు ఓ యజ్ఞంలా భావించాలి. గతంలోనే అనేక తప్పులు దొర్లి విద్యార్థుల ఆత్మహత్యలు జరి గాయి. పరీక్షల మదింపు కేంద్రాల వద్ద ప్రశ్నా పత్రాలను దిద్దే విషయనిపుణులకు సరైన సౌకర్యాలతోపాటు శాస్త్రీయంగా వారికి ఇవ్వవ లసినంత మేరకే పని ఇవ్వాలి. ఎక్కువగా ఇవ్వరాదు. ప్రశ్నపత్రాలను ముద్రణలోనూ జాగ్రత్తలు అవసరం.ఈ పరీక్షలు విద్యార్థులకు మాత్రమే కాదు. వారి తల్లిదండ్రులకు, సమాజానికి దేశ, రాష్ట్రాల సర్వతోముఖా భివృద్ధికి పాటుపడే రేపటి తరానికి జరుగు తున్నాయన్న విషయాన్ని మరువరాదు. ప్రశ్న పత్రాల, మదింపులో అవకతవకలు జరగకుండా చూడాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం ఎంత మాత్రం చేయకూడదు. ప్రభుత్వం గూగుల్‌ ‌మ్యాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాలను గుర్తించి జిల్లా, రాష్ట్రాల స్థాయిలో అధికారిక కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేసుకొని పర్యవేక్షణ, సౌకర్యాల కల్పన చేయాలి.

విద్యార్థులకు ఇంకో మాట.. మార్కులే ప్రతిభకు కొలమానాలు కాదు మార్కుల వేటలో పోటీ ధోరణులను తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలే రావద్దు. మార్కులే జీవితం కాదు మీరు జీవితంలో అనేక విజయాలు పొందాల్సి ఉంది. మీ బంగారు భవిష్యత్తుకై ఇష్టమైన రంగంలో శ్రమిస్తే గొప్పవాళ్ళుగా ఎదగవచ్చు. గొప్పవాళ్ల చరిత్రను చూస్తే… సచిన్‌ ఎన్నోసార్లు పరీక్షలు తప్పినా నిరాశ చెందకుండా తనకిష్టమైన క్రికెట్‌ను ఎంచుకుని రారాజుగా వెలుగొందాడు. ఐన్‌స్టీన్‌ ‌చిన్నప్పుడు మాటలు రాకపోయినా సృజనాత్మకంగా ఆలోచించి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇలా చాలామంది గొప్పవాళ్ళ చరిత్రల్లోకి వెళితే చదువులకంటే జీవితం ఎంతో విలువైందని తెలిసిపోతుంది. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ నిస్ప•హలకు లోనుకావద్దు. ‘‘ఆత్మవిశ్వాసం కన్నా గొప్ప ఆస్తిలేదు’’. ఉన్నది ఒక్కటే జీవితం… సంపూర్ణంగా జీవించాలనే విషయాలను మరువవద్దు.
మేకిరి దామోదర్‌
‌వరంగల్‌
9573666650

 

Leave a Reply