Take a fresh look at your lifestyle.

చట్టాలను చుట్టేసారు ..!

‘‌తమ  రాష్ట్రానికి సంబంధించిన శాసనాల రూపకల్పనలో తమకు  రెండేళ్ళుగా భాగస్వామ్యం లేకపోవడంతో  కాశ్మీరీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  2018 నుంచి రాష్ట్రంలో  ఎన్నో  పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ప్రజలకు భాగస్వామ్యం  లేదు..వారి సమ్మతీ లేదు..’

ఆగష్టు 4, 2020 న కర్ఫ్యూ ప్రాంతం శ్రీనగర్‌లో ….

2019 ఆగస్టు 5వ తేదీన నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం జమ్ము,కాశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఒక ఏడాది పాటు కాశ్మీర్‌ ఎటువంటి కార్య కలాపాలు లేవు. గత ఏడాది అంతా కాశ్మీర్‌ ‌లో ఏం జరిగిందో పరిశీలిద్దాం. దీనిపై ది వైర్‌ అధ్యయనం జరిపింది. చట్టాలను చాప చుట్టేశారు. ప్రజల అధికారాన్ని నామమాత్రం చేశారు, రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడమే కాకుండా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల రాష్ట్రం ప్రతిపత్తిని కోల్పోయింది. చట్టాలనుతమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ జరుగుతోంది. తాజాగా జూలై 17వ తేదీనజమ్ము,కాశ్మీర్‌ ‌కేంద్ర పాలిత ప్రాంత పాలనా మండలి రెండు చట్టాల్లో మార్పులు చేసింది.

సాయుధ దళాల ఆధీనంలో ఉన్న భూమిలో కొంత భాగాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ప్రకటించింది.నిర్మాణం, కార్యకలాపాలు అందులోనే జరిగేట్టు చేయడమే ఉద్దేశ్యం. వీటి పరమార్దం ఏమంటే చట్టాలను తిరగరాయడం.జమ్ము,కాశ్మీర్‌ ‌ప్రజల కోసం రూపొందించిన చట్టాలను మార్చేయడం.విధాన నిర్ణయాల్లో ప్రజలకు ఎటువంటి పాత్ర లేకుండా చేయడం. ఈ కొత్త తరహా ప్రక్రియతోప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ వర్గాలు, ఇతర వర్గాలు నిరసన తెలియజేస్తున్నాయి.గవర్నర్‌ ‌పాలనలో చట్టపరమైన మార్పులు చట్టాలను తిరగరాసే ప్రక్రియ మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ప్రారంభమైంది. రాష్ట్రంలోశాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందన్న మిషతో బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో మెహబూబా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. 2018 జూన్‌ 20‌వ తేదీన రాష్ట్రంలో గవర్నర్‌ ‌పాలన విధించారు. ప్రస్తుతం ఉన్నచట్టాలను సవరించడానికి గవర్నర్‌ 56 ‌చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలను జమ్ము, కాశ్మీర్‌ ‌రాజ్యాంగంలోని 92వ సెక్షన్‌ ‌లోని నాల్గవ ఉప సెక్షన్‌ ‌కింద తీసుకుని వచ్చారు. ఎన్నికైన ప్రజాప్రభుత్వం లేని సమయంలో గవర్నర్‌ ‌తన అధికారాలను ఉపయోగించి ఈ చట్టాలను తెచ్చారు.

2018 నుంచి అదే ఏడాది డిసెంబర్‌ ‌వరకూ ఆరుమాసాల పాటు ప్రజాభద్రతా చట్టం (పిఎస్‌ ఎ) ‌సహా అనేక చట్టాలకు సవరణలు తీసుకుని వచ్చారు. ఈ చట్టం కింద అరెస్టు అయిన స్థానికులను జమ్ము,కాశ్మీర్‌ ‌వెలుపల నిర్బంధించేందుకు అధికారాలను ఈ సవరణల ద్వారా ప్రభుత్వానికి లభించాయి. ఈ అధికారాలతో ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానా తదితర రాష్ట్రాల్లో కూడా కాశ్మీరీ డిటైనీలను నిర్బంధించారు. 370వ అధికరణం రద్దు తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న ముఖ్యపరిణామాల్లో ఇవి ఒకటి.

రోషినీ చట్టంగా ప్రాచుర్యం పొందిన కాశ్మీరీల భూమి హక్కుల చట్టాన్ని కూడా గవర్నర్‌ ‌రద్దు చేశారు. భూములను ఆక్రమించుకున్న వారు ఫీజులు చెల్లించి హక్కులు సంక్రమించే చట్టం ఇది 2018 జనవరిలో కథువా లైంగిక దాడి కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాదులు జిహాదీ యుద్ధాన్నిచిత్తు చేయడానికి ఏర్పాటు చేసిన ఇక్క్జుట్‌ ‌జమ్ము సంస్థ తరఫున ఈ ఉద్యమం సాగింది. 2018 జూన్‌- ‌డిసెంబర్‌ ‌మధ్య కాశ్మీర్‌ ‌మానవ హక్కుల చట్టాన్ని కూడా సవరించారు. 1997 నాటి ఈ చట్టాన్ని సవరించారు. మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులను మానవ హక్కుల కమిషన్‌ ‌స్వీకరించకుండా నిరోధించేందుకు ఈ సవర ణ తెచ్చారు. రాష్ట్రంలో మానవ హక్కులను కేంద్ర మానవ హక్కులతో సమానం చేసేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని సమర్ధించుకున్నారు., 1997 నాటి లడఖ్‌ అభివృద్ది మండలి చట్టం అధికారాలను తగ్గించడానికి ఈ మార్పులు చేశారు. వారికి ఓటింగ్‌ ‌హక్కులను హరించడమే ఉద్దేశ్యం.

రాష్ట్రపతి పాలనలో మార్పులుః
2018 డిసెంబర్‌ ‌లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం రాజ్యాంగం 77వ సవరణ చట్టం, 103 సవరణ చట్టాలను రాష్ట్రానికి వర్తింప జేశారు. వీటిని వర్తింప జేయడానికి కేంద్రం అనుసరించిన మార్గంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. గవర్నర్‌ ‌కేంద్రం నియమించిన వ్యక్తి.ఆ స్థానంలో ఉన్న వారికి అటువంటి ముఖ్యమైన అధికారం ప్రభుత్వం అనుమతి లేకుండా ఉంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

2019 ఆగస్టు 5లో మార్పులుః
గత ఏడాది ఆగస్టు 5వ తేదీన జమ్ము,కాశ్మీర్‌ ‌లో ఆంక్షలు విధించారు. ప్రజాస్వామ్య బద్ధంగాచట్టసభలకు ఎన్నికైన వారిని ఏకపక్షంగా గృహనిర్బంధంలో ఉంచారు. 370 అధికరణాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. దీంతో స్వాతంత్య్రానంతరం నాటి నుంచి కాశ్మీరీలు పొందుతున్న ప్రత్యేక హక్కులు రద్దు అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో వృత్తి విద్యా సంస్థల్లో సీట్ల దగ్గర నుంచి రాష్ట్రంలో స్థలాల కొనుగోలు వరకూ ఇంతవరకూ వారికున్న హక్కులు రద్దు అయ్యాయి. సి.ఓ 272, సిఓ 273 ఉత్తర్వులు, జమ్ము,కాశ్మీర్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం2019 కింద ఇవి రద్దు అయ్యాయి.’’.అదే ఏడాది సిఓ 273 ఉత్తర్వును కూడా జారీ చేశారు. దీంతో 370, 367 అధికరణాల్లోని అన్ని క్లాజులు సవరించినట్టు ప్రకటించారు రాజ్యాంగ సభ, అంటే రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర గవర్నర్‌ అని నిర్వచించబడింది. 370వ అధికరణంలోని ఏ క్లాజునైనా రద్దు చేసేందుకు రాష్ట్రపతి అనుమతి, సమ్మతి ఉండాలని రాజ్యాంగంలో స్పష్టం చేయబడింది.ఈ ఉత్తర్వుతో జమ్ము,కాశ్మీర్‌ ‌ప్రత్యేక అధికారాలు రద్దయ్యాయియ. జమ్ము,కాశ్మీర్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత మార్పులు చాలా చేశారు. దేశం లోని అన్ని ప్రాంతాలకూ వర్తించే పార్లమెంటు చేసే చట్టాలు, నిబంధనలు కాశ్మీర్‌ ‌కు వర్తిస్తాయని స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంలో ఇబ్బందులను తొలగించే ఉత్తర్వును కూడా జారీ చేశారు.

2020 మార్చి 30వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జమ్ము,కాశ్మీర్‌ ‌పునర్వ్యవస్థీకరమ ఉత్తర్వును జారీ చేసింది. దీంట్లో చాలా మార్పులు చేశారు. ఈ ఉత్తర్వులో జమ్ము, కాశ్మీర్‌ ‌సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌వికేంద్రీకరణ రిక్రూట్‌ ‌మెంట్‌ ‌చట్టం 2010 చట్టాన్ని కూడా సవరించారు., ప్రభుత్వ ఉద్యోగాలు ఇతరులకు దక్కేందుకు అవకాశం కల్పించారు., జమ్ము,కాశ్మీర్‌ ‌లో 15 సంవత్సరాలు నివసించినా, ఏడేళ్ళు చదివినా, పదవ తరగతి, 12వ తరగతి పరీక్షలకు హాజరైనా, ఉద్యోగాలకు అర్హులని ప్రకటించడం జరిగింది. 2019 ఆగస్టు 5తేదీకి ముందు రాష్ట్రంలో ఉద్యోగాలకోసం ప్రభుత్వం రాష్ట్రంలోని వారి కోసమే అడ్వర్‌ ‌టైజ్‌ ‌చేసేది. రాష్ట్ర చట్టాల్లో కొన్ని మార్పులు కూడా చేశారు. ముఖ్యమంత్రి పదవి ప్రతిపత్తిని తగ్గించే మార్పులు కూడా ఉన్నాయి. ఈ మార్పుల ప్రకారం ఇస్లామిక్‌ ‌యూనివర్శిటీ ఆఫ్‌ ‌సైన్స్ ‌టెక్నాలజీ (ఐయూఎస్‌ ‌టి బాబా గులామ్‌ ‌షా బాద్షా యూనివర్శిటీ జమ్ము, కాశ్మీర్‌ ‌క్లస్టర్‌ ‌యూనివర్శిటీలకు ఇంతవరకూ ముఖ్యమంత్రి చాన్సలర్‌ ‌గా వ్యవహరించేవారు.

ఈ మార్పులు కారణంగా గవర్నర్‌ ‌ఛానల్సర్‌ ‌వ్యవహరించేందుకు అనుమతి ఇచ్చారు. లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌కు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఈ ఏడాది జూలై 17వ తేదీన మరిన్ని మార్పులు చేశారు. చట్టాల్లో ఎన్నడూ లేని విధంగా మార్పులు చేశారు. పార్లమెంటు సభ్యుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి హస్నైన్‌ ‌మసూదీ 370 వ అధికరణం రద్దు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించడం, నియోజకవర్గాల పరిధులు తగ్గించడం వంటి చర్యలను సుప్రీంకోర్టులో సవాల్‌ ‌చేస్తామని అన్నారు. జమ్ము,కాశ్మీర్‌ ‌లో తన అజెండాను అమలు చేసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి రాజకీయాలను అనుసరిస్తోందని పీడీపీ సీనియర్‌ ‌నాయకుడు , రాష్ట్ర మాజీ మంత్రి నయీమ్‌ అఖ్తర్‌ ఆరోపించారు. కాశ్మీరీలను రోజురోజుకీ ఎలా అణగతొక్కుతున్నామో చూడండి అని తమ హిందూవోటర్లకు చూపడం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగాకనిపిస్తోందని ఆయన అన్నారు.

 

Leave a Reply