Take a fresh look at your lifestyle.

గాయపడ్డ సూర్యుడు

భూమిపై
కమ్మని పంట కలల్ని ఆరబోస్తూ
ఆకలి రక్కసిని అంతమొందిస్తూ
నిరంతరం శ్రమ భిందువై
అందరి ఆకలికి అపరబ్రహ్మలు అన్నదాతలు

సూర్యుడింకా
నిద్ర లేవలేదు
పంట సూర్యుడు మాత్రం
మాగాణిపై వాలి
పంటతో రేపటి చరిత్రను
కొత్తగా, సరిక్రొత్తగా
శ్రమ స్వేదంతో లిఖిస్తున్నాడు
ఉదయం నుంచీ,సాయంత్రం అంచుల అరకూ
అలుపెరుగని సూర్యుడల్లే
పంట కలల్ని ఆరబోస్తూ పయనిస్తున్నాడు

కలలు ఫలిస్తేనే
పంట కలలు సాకారం అవుతాయి
పంటపై నిలబడ్డ అడుగులకు
ఊతం అందితేనే ఊపిరి నిలుస్తుంది

ఇంకా ఎన్నాళ్ళు ?
పంటలపై పెత్తనపు అజమాయిషీ ఎన్నేళ్ళు ?
నల్ల చట్టాల ముసుగులో
రైతుకు నిర్బంధపు దాస్టీకపు  సంకెళ్ళా ?

ఆరుగాలం శ్రమించి
కలల తీరాన్ని చేరలేక
పండించే పంటను విడువలేక
నిత్యం పోరాడుతూ
సాగు చట్టాల పోరుపై పయనిస్తూ
గాయపడ్డ పంటల సూర్యుడికి
గడ్డు రోజుల కాలం కరిగి
రైతే రాజన్న నానుడి నిజం కావాలని
మనసారా కాంక్షిద్దాం…!!

         – మహబూబ్‌ ‌బాషా చిల్లెం
                             9502000415

Leave a Reply