Take a fresh look at your lifestyle.

‌ప్రపంచవ్యాప్తంగా ‘పిపిఈ’ల కొరత : డబ్ల్యూహెచ్‌ఓ

‌ఫిబ్రవరిలో ఎగుమతులకు అనుమతి..మార్చి 20న నిషేధించిన  కేంద్ర ప్రభుత్వం

ఫిబ్రవరి 27 నాడు డబ్ల్యూహెచ్‌ఓ ‌ప్రస్తుత కరోనా వైరస్‌ ‌కారణంగా ప్రపంచ వ్యాపితముగా వున్నా వ్యక్తిగత రక్షణ పరికరాల నిల్వలు పిపిఇ అని కూడా అంటారు సరిపోవు అని తెలుపుతూ మార్గదర్శకాలను జారీ చేసింది, ముఖ్యంగా వైద్య మాస్కలు, రెస్పీరేటర్లు, గౌన్లు, గాగుల్స్ అవసరం చాల ఉందని ప్రస్తుతం జరుగుతున్నా పిపిఇ కిట్స్ ఉత్పత్తి, సరఫరా సరిపోదని డబ్ల్యూహెచ్‌ఓ అం‌ది. పిపిఇ కిట్స్ ‌కి గ్లోబల్‌ ‌డిమాండ్‌ ‌పెరగడం అనేది కేవలం కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరగటం వల్లే కాకుండా, తప్పుడు సమాచారం, భయాందోళనలు స్టాక్‌పైలింగ్‌ ‌వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా పిపిఇ కిట్స్‌కొరత ఏర్పడుతుంది అని డబ్ల్యూహెచ్‌ఓ ‌తన మార్గదర్శకాలలో వివరంగా వివరించింది. వ్యక్తిగత రక్షణ పరికరాల పిపిఇ ) ‌జాబితాలో గ్లౌజ్లు, మెడికల్‌ ‌మాస్క్‌లు, గౌన్లు, చీ 95 మాస్కలు, రెస్పీరేటర్లు వస్తాయి. చైనాలో ఎలక్ట్రిక్‌ ‌కార్లు తయారుచేసే ఫ్యాక్టరీ వ్యక్తిగత రక్షణ పరికరాల (••జు కిట్స్) ‌తయారీ చేసే ఫ్యాక్టరీగా తనను తాను మలచుకొని చైనా దేశ హాస్పిటల్‌ ‌సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాల అవసరాన్ని తీర్చటానికి ప్రయత్నం చేస్తున్నది. ఇక మన దేశ విషయానికి వస్తే, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కిట్స్ ‌ను , వీటి తయారీ ముడిసరుకు ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్‌ ‌జారీ చేయడానికి భారత ప్రభుత్వం చాలా జాప్యం చేసింది. మార్చి 19వరకు మనదేశములో ఉత్పత్తి అవుతున్న పిపిఇ కిట్స్ ఎగుమతి అయినాయి. జనవరి 31న, భారతదేశంలో మొదటి కోవిడ్ -19 కేసు నమోదు అయ్యింది. దీనికి ఒక రోజు తరువాత, ప్రభుత్వ డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌ఫారిన్‌ ‌ట్రేడ్‌ అన్ని పిపిఇ కిట్స్ ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ ఒక నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అయితే కేవలం ఒకే ఒక్క వారంలో అంటే ఫిబ్రవరి 8న, ప్రభుత్వం ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకుని సర్జికల్‌ ‌మాస్కలు అన్ని రకాల గ్లౌజ్‌ ‌లు ఎగుమతి చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి 25న, ఇటలీలో కరోనా వైరస్‌ ‌వల్ల 11 మరణాలు రెండు వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీనితో పిపిఇ కిట్స్ ‌కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ‌పెరిగింది. దీనితో ప్రభుత్వం పిపిఇ కిట్స్ ఎగుమతి ఆంక్షలను మరింతసడలించింది, అంతే కాదు పిపిఇ కిట్స్ ఎగుమతిలో ఎనిమిది కొత్త వస్తువులకు కూడా అనుమతించింది. ఇలా చేయటం ద్వారా డబ్ల్యూహెచ్‌ఓ ‌సిఫారసు చేసినట్లుగా పిపిఇ కిట్స్ ‌నిల్వ చేయటంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా లేకుండా నిర్లక్షయంగా వ్యవహరించింది. దేశంలో పనిచేసే హెల్త్ ‌వర్కర్స్ ‌కోసం పిపిఇ కిట్స్ ‌నిల్వ చేయాలి అనే ఆలోచన లేకుండాదేశంలో పిపిఇ కిట్స్ ఉత్పత్తి చేసే కంపెనీలు లాభాలు ఆర్జించుకునేలా ప్రభుత్వంఎగుమతులను ప్రోత్సహించింది. తత్ఫలితంగా, భారతదేశ వైద్యులు, నర్సులు ప్రమాదం అంచులో ఉండి పనిచేసే పరిస్థితిలో వున్నారు. స్పష్టమైన డబ్ల్యూహెచ్‌ఓ ‌మార్గదర్శకాలు ఉన్నప్పటికీ భారతదేశ హెల్త్ ‌వర్కర్స్ ‌ని కరోనా వైరస్‌ ‌నుంచి రక్షణ ఇచ్చే పిపిఇ కిట్స్ ‌నిల్వలు భారత ప్రభుత్వం పెంచుకోలేదు. ఆదివారం 1.3 బిలియన్ల భారతీయులు జనతా కర్ఫ్యూ అమలు చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి మేరకు, తమ ఇంటి లోగిలిలో నిలబడి దేశ ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వైరస్‌ ‌కాలంలో హాస్పిటల్లో పని చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెమ్మదిగా పెరుగుతున్న భయానక కరోనా వైరస్‌ ‌తో భారతీయ హాస్పిటల్‌ ‌సిబ్బంది పోరాడుతున్నారు, కనుక వీరిని గౌరవించాలి అని ప్రధాని కోరిన మేరకు దేశ ప్రజలు అందరూ ప్రధానిని విజయవంతం చేసారు. అయితే దేశ ప్రధాని భారతీయ హాస్పిటల్‌ ‌సిబ్బందిని విజేతలు చేయటానికి ఏం చేసారు..? అన్న ప్రశ్నకి మనముందు వున్నా సమాధానం.. భారతీయ హాస్పిటల్‌ ‌సిబ్బంది కోసం పిపిఇ కిట్స్ ‌నిల్వ చేయటంలో భారత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత రెండు నెలల్లో మాస్కలు, గౌన్లు, గ్లౌజలు కావలసినన్ని కేంద్ర ఆరోగ్య శాఖ నిల్వ చేయలేదని తెలుస్తున్నది. మార్చి 18న ‘‘జనతా కర్ఫ్యూ’’ అమలు చేయాలని మోడీ దేశానికి పిలుపునిచ్చారు, అదే రోజు భారతదేశ హెల్త్ ‌వర్కర్స్ ‌కి మద్దత్తుగా బాల్కనీల నుండి చప్పట్లు కొత్తమని ప్రజలను కోరారు. అయితే మార్చి20న మాత్రమే భారత ప్రభుత్వం, దేశీయంగా ఉత్పత్తి అయిన పిపిఇ కిట్స్ ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది.

స్వీయ రక్షణ పరికరాలు కావాలి: వైద్యులు
కోవిడ్‌-19 ‌సోకినవారికి నిర్విరామంగా వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే కాదు తమకు రక్షణ కల్పించాలంటున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ‌సహా ప్రతిష్ఠాత్మక మైన ఆస్పత్రులలో వైద్యులెవరికీ సరైన సౌకర్యాలు లేవు. భయంకరమైన రోగులకు సేవలందించే స్వీయ రక్షణ పరికరాలు లేవు కరోనా సోకినవారికి సేవలందిస్తున్న వైద్యులు శానిటైజర్లను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. అలాగే, మాస్క్ ‌లను సొంత ఖర్చుతో కొనుగోలు చేస్తున్నారు. ఇతర పరికరాలను సొంతంగా సమకూర్చుకుంటున్నారు. ఎయిమ్స్ ‌సహా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల రక్షణ పరికరాలు ఎక్కడా అందుబాటులో లేవు. నేను ప్రభుత్వ సర్జన్‌ ‌ను. కోవిడ్‌-19 ‌రోగుల సేవలో నిమగ్నమై ఉన్నాను. నాకు కూడా కోవిడ్‌ ‌సోకవచ్చు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పటి వరకూ నేను పరీక్ష చేయించుకోలేదు. ఆ డాక్టర్‌ ‌చెప్పిందేమిటంటే. తాను రోజుకు 600 మందికి పరీక్షలు నిర్వహిస్తుంటాననీ, వారితో పాటు ఇద్దరు బయటవ్యక్తులు వస్తుంటారనీ, వచ్చేవారిలో ఆరోగ్య వంతులెవరో రోగగ్రస్తులెవరో తెలియదనీ, అయినా అందరికీ సమాధానం చెబుతూ ఉండాలని ఆ వైద్యురాలు ట్విట్టర్‌ ‌లో పేర్కొన్నారు. మాకు మీ చప్పట్లు కాదు. కావల్సింది.

మీ నుంచి నిజాయితీగా, హృదయపూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం. ఇంత భయంకరమైన పరిస్థితులలో పని చేస్తున్న మాకు తగిన రక్షణ లేదు. రోగుల మధ్య మసిలేవారికి మమ్మల్ని రక్షించుకునే సాధానాలు లేవు. మేం కోరుతున్నది మాకు రక్షణ కల్పించే సాధనాలు, పరికరాలు. స్వీయ రక్షణ పరికరాలు ( పర్సనల్‌ ‌ప్రోటెక్టివ్‌ ఎక్విప్‌ ‌మెంట్‌) ఒక్క ఎయిమ్స్ ‌లోనే కాదు, దేశంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ లేవు. రోగం సేవలందించే వైద్యల పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారని చాలా మంది డాక్టర్లు వివిధ సందర్భాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు., 3 ఎంస డ్యూ పాయంట్‌, ‌హానీవెల్‌ ‌వంటివి ఏ ఆస్పత్రిలోనూ లభించవు.వాటిని విదేశాల నుంచి తెప్పించుకోవల్సి ఉంది. వాటికి విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. అమెరికాలో హ్యాష్‌ ‌టాగ్‌ ఎంఇ ‌పీపీఈ కోసం వైద్యులు ఎన్నో రోజులుగా డిమాండ్‌ ‌చేస్తున్నారు. పర్సనల్‌ ‌ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌ ‌మెంట్లో ఫేస్‌ ‌మాస్క్ ‌లు, ఐ షీల్డ్, ‌షూ కవర్‌ , ‌గ్లోవ్స్ (‌చేతుల తొడుగులు) వంటి వాటిని రోజుల తరబడి ఉపయోగించాల్సి వస్తోందనీ, వీటి వల్ల రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని రోజుకు ఆరు గంటలు మించి వినియోగించరాదని అయితే, ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ నిబంధనను ఎవరూ పాటించడం లేదని వైద్యులు చెబుతున్నారు.

ప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం 10 మిలియన్‌ ‌సర్జికల్‌ ‌మాస్క్ ‌లు, ఆరు మిలియన్‌ ఎన్‌ -95 ‌మాస్క్ ‌లు 7 లక్షల శరీరం మొత్తం కప్పే వస్త్రాలు అవసరం., కానీ, ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పారా మెడికల్‌ ఉద్యోగులకు కూడా తగిన యూనిఫారం ఉండటం లేదు. వీటిని బెంగళూరు , గూర్గావ్‌ ‌లలో తయారు చేస్తారు. ఈ రెండు కేంద్రాల్లో కలిసి లక్షలోపు తయారవుతాయి. ప్రొటెఎక్షన్‌ ‌వేర్‌ ‌మాన్యుఫాక్షరర్స్ ‌కు దాదాపు ప్రతినెలా లేఖలు రాస్తున్నామనీ, కానీ, వారి నుంచి తగిన సమాధానం రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. శానిటైజర్లు, మాస్క్ ‌లు లేకపోయినా రోగులకు సకాలంలో అందిస్తున్నామని ఒక వైద్యుడు చెప్పారు. మాస్క్ ‌ల కోసం సొంత డబ్బు ఖర్చు చేస్తున్నామని ఒక వైద్యుడు చెప్పారు. ఐసోలేషన్‌ ‌వార్డుగా ప్రకటించినవి తప్ప మిగిలిన ప్రాంతాలను ప్రోటోకాల్‌ ‌ప్రకారం శానటైజ్‌ ‌చేయడం లేదని వైద్యులు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ‌కి చెందిన ఒక జూనియర్‌ ‌డాక్టర్‌ ఇదే మాదిరి తన ఆవేదనను వ్యక్తం చేసారు..95- మాస్క్ ‌లు ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. వైద్య కళాశాలన్నింటిలో పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. శాంపిల్స్ ‌సేకరణ, వాటికి పరీక్షలు నిర్వహించేందుకు తగిన పరికరాలు లేవని మూడు దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న ఒక వైద్యుడు పేర్కొన్నారు. కరోనా రెండవ దశలో ప్రవేశించిన తర్వాత కూడా అవే మాస్క్ ‌లు వాడుతున్నారని రోగులే ప్రశ్నిస్తున్నారని ఒక వైద్యుడు పేర్కొన్నారు. ముంబాయికి చెందిన ఒక వైద్యుడు మాలో పెద్ద వారికి పరీక్షలు జరిపించలేకపోతున్నామని తాము పంపిన శాంపిల్స్ ‌ను కస్తూర్బా ఆస్పత్రి వారు అనుమతించడం లేదని అన్నారు. రోగులను తమ వద్దకు పంపాలనీ, కేసుల ను బట్టి వారి పరీక్షలు నిర్వహించాలో లేదో నిర్వహిస్తామని చెబుతున్నామని ఆ వైద్యుడు చెప్పారు.

Leave a Reply