Take a fresh look at your lifestyle.

ప్రపంచ వాణిజ్యం కుప్పకూలుతుంది డబ్ల్యుటిఓ నివేదికలో వెల్లడి

కోవిడ్‌-19 ‌వల్ల ప్రపంచ వాణిజ్యం ఎన్నడూ లేని రీతిలో కుప్పకూలుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జెనీవా కేంద్రంగా పని చేసే ఈ సంస్థ భవిష్యత్‌లో జరగనున్న రెండు పరిణామాలను ఆ నివేదికలో పొందుపర్చింది. ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఆరోగ్య సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో దాని ప్రభావం అన్ని రంగాలపైనా ఉంటుందని పేర్కొంది. మర్చండైజ్‌ ‌వాణిజ్యం 2020లో 13 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. 2021 నాటికి 21 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. కానీ, కొరోనా ప్రభావం వల్ల అది 13 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. దేశీయ నికర ఉత్పత్తి 2020లో 2.5 శాతం నుంచి 2021 నాటికి 7.4 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ వస్తు వాణిజ్యం ఈ ఏడాది 32 శాతానికి తగ్గగలదని, వచ్చే ఏడాదికి 24 శాతానికి చేరుకోగలదని పేర్కొంది. కొరోనా ప్రభావం వల్ల తగ్గిన వాణిజ్య శాతం పుంజుకోవడానికి కొంత కాలం పట్టవచ్చని ఆ సంస్థ వివరించింది.

కొరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా 80,000 మంది మరణించారనీ, మరో 15 లక్షల మంది కొరోనా ప్రభావానికి లోనయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కొరోనా ప్రభావం వల్ల ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య దేశాలు తమ తమ దేశాలలో సంస్థలను మూసివేశాయని దాని వల్ల ఎన్నడూ లేని విధంగా వాణిజ్య రంగానికి తీరని నష్టం వచ్చిందని డబ్ల్యుహెచ్‌ఓ ‌పేర్కొంది. కొరోనా ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ఎం‌త కాలం కొనసాగిస్తాయనేది తెలియని పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మేనేజింగ్‌ ‌డైరక్టర్‌ ‌క్రిస్టాలినా జార్జీయవా పేర్కొన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల భారత్‌ ‌వంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని క్రిస్టాలినా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మే వరకూ లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగవచ్చని అంచనా వేశారు. సేవారంగంలో కూడా వాణిజ్యం బాగా తగ్గింది. 2020లో ట్రేడ్‌ ‌వాల్యూమ్స్‌లో రెండెంకెల పతనం తథ్యమని అంచనా వేశారు. ఈ పరిస్థితులలో ప్రజలు ఖర్చు చేయడం అనేది ఊహకందని విషయమే. లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగితే ప్రజలు తమ వద్ద ఉన్న నిధులను ఆచితూచి ఖర్చు చేస్తారనీ, అందువల్ల ఖర్చు బాగా తగ్గవచ్చని డబ్ల్యుటిఓ అంచనా వేసింది.
-‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

error: Content is protected !!