Take a fresh look at your lifestyle.

మీడియా కు ధన్యవాదాలు..!

  • కొరోనా కాలం లో వారి కృషి అభినందనీయం
  • కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

నేడు   “ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవము”(World Press Freedom Day) సందర్భంగా న్యూస్ పేపర్ ఎలక్ట్రానిక్ మీడియాలోని జర్నలిస్టులందరికి  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య  పట్టు కొమ్మగా, నాలుగో స్తంభంగా మీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.అలానే ఎప్పటిలా  జర్నలిజం మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉంటూ.. వాస్తవికత, నిజాయితీతో కూడిన సమాచారంతో,వార్తలతో  ప్రజలను చైతన్య పరుస్తూనే ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వానికి,అటు ప్రజలకు  వారధిగా మీడియా చేస్తున్న కృషిని, సమాచార సేవలని వెలకట్టలేమని కిషన్ రెడ్డి కొనియాడారు.కరోనాపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో వాస్తవాలు తెలియజెప్పడంలో ప్రభుత్వ సూచనలు,ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తున్న ప్రతి ప్రెస్/మీడియాకి  ధన్యవాదాలు అని మంత్రి చెప్పారు. కరోన మహమ్మరిపై అందరి సహకారంతో  త్వరలోనే విజయం సాధిస్తామని, విజయం మరెంతో దూరం లేదని , ఈ సమయంలో ప్రాణాలకి తెగించి వార్తలందిస్తున్న జర్నలిస్టులు సైతం స్వీయ రక్షణ,మాస్కులను ధరించి పోరాడాలని కిషన్ రెడ్డి కోరారు.

Leave a Reply