Take a fresh look at your lifestyle.

గంగి గోవుపాలు గరిటెడైనను చాలు

ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఓ) ఆధ్వర్యంలో 2001 సంవత్సరం నుండి జూన్‌1‌వ తేదిని, ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పాల వినియోగంపట్ల అవగాహణను పెంచుతూ, పాలు మరియు పాల ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించడం కోసం ప్రపంచ పాల దినోత్సవంను జరుపుతున్నారు. ఆరోగ్యకర జీవితం గడపడానికి పాలు ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యం బాగుంటేనే ఆనందంగా ఉండగలం. అందువల్ల ప్రతి కుటుంబానికి పాలు నిత్యా వసరం లాంటివి. ఉపఉత్పత్తుల రూపంలోను పాలు మనిషికి ఎన్నో రకాలుగా అవసరమవుతుంటుంది. పాలలో మూడు రకాల ఉపయోగాలున్నాయి. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్స్), ‌మాంసకృతులు, కొవ్వుపాలలో ఉంటాయి. కాగా గేదె పాలలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి.

భోజనంలో పెరుగుగా, దాహం తీర్చే మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకోవా, ఇలా అనేక సమయాల్లో అనేక రకాలుగా పాల అవసరం మనిషికి ఉంటుంది. పాలు లేని ప్రపంచం ఊహించలేం. మనిషి రోజూ 350 మిల్లీ లీటర్ల పాలుతాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పాల ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. పాలల్లో జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తులు ఉంటాయి. ఇందులో అధికశాతం పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయని యూకేలోని నేషనల్‌ ‌హెల్త్ ‌సర్వీస్‌ ‌చెబుతోంది. పాలలో ఉండే విటమిన్‌ ఏ, ‌డీలు ప్రతీఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు పాలవల్ల ఐరన్‌, ‌కాల్షియం, విటమిన్లు, జింక్‌, అయోడిన్‌ ‌వంటి పోషకాలన్నీ లభిస్తాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా మనం తీసుకునే బాదం, సోయాపాలల్లో అలాంటి పోషకాలేవి ఉండవు. కేవలం చక్కెర శాతం మాత్రమే అధిక స్థాయిలో ఉంటుంది.

నాణ్యతకు మారుపేరుగా నిలుస్తుంది ముల్కనూర్‌ ‌స్వ కృషి మహిళా పాలడైరీ:
చదువురాకపోయినా, ఎవరి సహకారం లేకున్నా అచంచెలమైన ఆత్మ విశ్వాసం, శ్రమించే తత్వం, దీర్ఘకాలిక లక్ష్యం ఉంటే చాలు ఏరంగంలోనైనా రాణించవచ్చు. అందుకు నిదర్శనమే ముల్కనూర్‌ ‘‌స్వకృషి’ మహిళలు. ‘క్షీర’ విప్లవంతో ప్రపంచంలోనే తమకంటూ ఒక పేజీని లిఖించుకున్నధీ రవనితలు. కరీంనగర్‌ ‌జిల్లా (ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌) ‌భీమదేవరపల్లి అనగానే ఒకప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు ఊరు వంగర గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఆ మాట వినగానే ముల్కనూర్‌ ‌డెయిరీ అందరినోటా వినిపిస్తోంది. ఈఖ్యాతి వెనుక ఎంతో మంది నారీమణుల శ్రమశక్తి దాగుంది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు కరువు కాటకాలు, దుర్భిక్ష పరిస్థితులు, చీడపీడలు, ప్రకృతి వైపరిత్యాలు, ధరల లేమి, విద్యుత్‌ ‌కోతలు అన్నదాతల వెన్ను విరుస్తుంటే పాడిపరిశ్రమ వారికి చేయూతనందించింది. సాగులో శ్రమకు తగిన ఫలితం రాకున్నప్పటికీ అన్ని కాలాల్లోనూ పాలకు గిట్టుబాటు నంది స్తూకుటుంబాలకు బాసటగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ముందే ఊహించి సమిష్టిగా నిర్మించుకున్న డెయిరీ ఇప్పుడు ‘ఇంతింతైవటుడింతై’ అన్నట్లుగా ముందుకు సాగుతోంది.

తెలంగాణ మారుమూల పల్లెల్లో పుట్టిపెరిగిన ముల్కనూర్‌ ‌ప్రాంత మహిళా రైతులు ‘కవ్వమాడిన చోట కరువు ఉండదు’ అన్న పెద్దల మాటను వంటపట్టించుకున్నారు. చేయీ చేయీ కలిపి, రూపాయికి రూపాయి జమచేసి పొదుపు అలవాటు చేసుకున్నారు. ఇంతింతె •వటుడింతె •అన్నట్లు తాముకూడ బెట్టుకున్న పొదుపు సొమ్ముతోనే ఏకంగా మహిళా డెయిరీ• •నెలకొల్పి కోట్లసంపదను సృష్టించారు. స్వకృషి బ్రాండ్‌ ‌పేరిట పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ, దినదినాభివృద్ధి సాధిస్తూ మహిళాస హకార స్ఫూర్తిని దశదిశలా చాటుతున్నారు. వీరి కృషికి మెచ్చి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దివంగత సీఎం వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి, గవర్నర్‌ ‌నరసింహన్‌ ‌తదిత• •ప్రముఖులు కితాబునిచ్చారు. ముల్కనూర్‌ ‌డెయిరీ ‘స్వకృషి’ బ్రాండ్‌ ‌పేరుతో సుమారు 10 తెలంగాణ జిల్లాల్లో పాలు, పెరుగు, నెయ్యి, లస్సీ, స్వీట్‌లస్సీ, మజ్జిగ, దూద్‌పేడ్‌, ‌స్వీట్లు విక్రయిస్తుంది. 20 వేల సభ్యులతో ఏటా లాభాల బాటలో పయనిస్తున్నది.

నాణ్యతలో రాజీ లేకుండా శుభ్రమైన, స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాలను విక్రయిస్తున్నామని, రూ. 90 కోట్లవార్షిక ఆర్థిక లావాదేవీలతో లాభాల బాటలో పయనిస్తున్నామని ఆయన అన్నారు. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నాలుగుసార్లు ఐఎస్‌వో గుర్తింపు లభించింది. 2012 డిసెంబర్‌ 6‌నరాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది. పశువుల పెంపకంలో బ్రెజిల్‌ ‌మొదటి స్థానంలో ఉండగా, మనదేశం రెండోస్థానంలో ఉంది. పాలఉత్పత్తిలోనూ ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్‌ ‌నిలిచింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశం 21 శాతం కలిగి ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక మన దేశంలో పాల ఉత్పత్తిలోఉత్తరప్రదేశ్‌ ‌మొద• •స్థానంలో ఉండగా, రాజస్థాన్‌ ‌రెండో స్థానంలోఉంది. ఇక మధ్యప్రదేశ్‌ ‌మూడోస్థానం, ఏపీ నాలుగో స్థానం, గుజరాత్‌ ఐదో స్థానాల్లో ఉన్నాయి.

కానీ, పాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి కోసం ‘క్షీర విప్లవం’ చేపట్టిన మన దేశంలోనే కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వరంగ డెయిరీ సంస్థలు స్వచ్ఛమైన పాలనే అందిస్తూ వస్తున్నా, సాక్షాత్తు పాలకులే ప్రైవేటు డెయిరీలకు కొమ్ము కాస్తుండటంతో కల్తీపాల వ్యాపారానికి అడ్డు లేకుండా పోతోంది. మనదేశంలో ప్యాకెట్లలో లభించే పాలలో ఏకంగా 68 శాతం మేరకు కల్తీ పాలేనని ఫుడ్‌ ‌సేఫ్టీ అండ్‌ ‌స్టాండర్డస్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) ‌గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. కలీ్త లేకుంటే పాలకు మించిన పోషకాహారం లేదు. కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలి. చిన్న, పెద్దడైరీలు, సహకార సంఘాలు, నష్టాల బారిన పడకుండాను సహకరించాలి.

dr md
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply