Take a fresh look at your lifestyle.

ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధిలో వెనకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం. ప్రపంచంలో అక్షరాస్యతలో వెనకబడిన దేశం భారతదేశం. దీనివలన మానవ అభివృద్ధి సూచిక లో మన దేశం వెనకబడిపోయింది. భారతదేశ సగటు అక్షరాస్యత 74 శాతం కాగా మన రాష్ట్ర అక్షరాస్యత సగటు 66 శాతం మాత్రమే. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. ఎన్ని అక్షరాస్యత ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టినను వయోజనులలో అక్షరాస్యత పెంచడంలో వెనకబడే ఉన్నాం.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉన్నది.

ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత దినోత్సవ వేడుకలు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకొను టకు సెప్టెంబర్‌ 8‌వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. కానీ గత సంవత్సరన్నర కాలంగా అక్షరాస్యత కార్యక్రమాలు కోవిడ్‌- 19 ‌కారణంతో నిలిచిపోయాయి. ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధిలో వెనకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం. ప్రపంచంలో అక్షరాస్యతలో వెనకబడిన దేశం భారతదేశం. దీనివలన మానవ అభివృద్ధి సూచిక లో మన దేశం వెనకబడిపోయింది. భారతదేశ సగటు అక్షరాస్యత 74 శాతం కాగా మన రాష్ట్ర అక్షరాస్యత సగటు 66 శాతం మాత్రమే. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. ఎన్ని అక్షరాస్యత ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టినను వయోజనులలో అక్షరాస్యత పెంచడంలో వెనకబడే ఉన్నాం.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉంది.

తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉన్నది. అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం వలన జాతీయస్థాయి మానవ అభివృద్ధి సూచీలో రాష్టం వెనుకబడి ఉంది .తెలంగాణలో అక్షరాస్యత శాతం పెరిగితేనే అభివృద్ధి సూచీలో తెలంగాణ స్థానం మెరుగవుతుంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సాక్షర భారత్‌ ‌కార్యక్రమంతో కొంత ప్రయోజనం కలిగింది.

World Literacy Day

కానీ సాక్షర భారత్‌ ‌కార్యక్రమం మార్చి 2018 ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి పొడిగించాలేదు. ఈ కార్యక్రమం అనంతరం ఎలాంటి అక్షరాస్యత కార్యక్రమాలను తీసుకోవడం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలలో సర్వే ద్వారా నిరక్షరాస్యులను గుర్తించడం జరిగింది. గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చుటకు ప్రణాళికలను రూపొందించాల్సిన సమయంలో లో కోవిడ్‌-19 ఉపద్రవం రావడం జరిగింది. దీనితో అక్షరాస్యత కార్యక్రమాలు నిలిచిపోయాయి.

కావిడ్‌ 19 ఉపద్రవం తగ్గిన తర్వాత అక్షరాస్యత కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కలదు.ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. కావున మహిళలను పెద్ద సంఖ్యలో అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం కలదు. విద్యావంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక ఉద్యమంలా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాల నందు భాగస్వాములు అయితే సంపూర్ణ అక్షరాస్యత సాధించడం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలకు కార్యక్రమాలకు చేయూతను అందించాలి. ( సెప్టెంబర్‌ 8 ‌ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా)
– పూల్లూరు వేణుగోపాల్‌, 9701047002.

Leave a Reply