ఎన్నికల ఫలితాలను ధృవీకరి ంచడానికి కాంగ్రెస్ సమావేశమై నందున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్ద తుదారులు ఆయనను ప్రోత్సహించి, యుఎస్ క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిడంతో ప్రపంచ నాయకులు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు , అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించిన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపును అధికారికంగా ప్రకటించకుండా కాంగ్రెస్‌ను అడ్డుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన కుతంత్రం ప్రపంచ దేశాల ముందు అమెరికా తలదించుకొనేలా చేసింది.
ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టడంతో వేలమంది ఒక్కసారిగా క్యాపిటల్ హిల్‌లోకి చొచ్చుకెళ్లారు. వాషింగ్టన్లో కాంగ్రెస్ ఉభయసభలు,కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసే వేదిక కూడా అక్కడే ఉంటుంది. గతేడాది నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలవడం జరిగింది. ఎన్నికలలో మొత్తం 538 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లకుగానూ జో బైడన్ 306 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా, ట్రంప్ కు 232 ఓట్లు లభించాయి.. అధ్యక్ష పీఠానికి అవసరమైన 270 ఓట్ల కంటే అధికంగానే బైడన్ సాధించారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్.. తన ఓటమిని అంగీకరించలేదు. ఆయన పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లన్నీ తిరస్కరణకు గురైనప్పటికీ వైఖరి మార్చుకోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తన గెలుపును అడ్డుకున్నారంటూ ట్రంప్ ఆరోపణలు చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు తొలగించబడ్డాయి. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన అనంతరం ఈ వీడియోను తొలగించారు ట్రంప్ ట్విట్టర్ కాతను కూడ నిలిపివేశారు. ఆయనపై ఎంతోకొంత ఉన్న అభిమానం తాజాగా క్యాపిటల్ భవనం పై జరిగిన దాడితో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికీ అయినా ట్రంప్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేకుంటే, అమెరికా చరిత్రలో ఘోరమైన అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాషింగ్టన్లో చోటుచేసుకున్న ఘటనను ప్రపంచం దేశాలూ వ్యతిరేకిస్తుండగా, తమ దేశం పరువు పోయిందని అమెరికా పౌరులు మండిపడుతున్నారు.
సుమారు 207 ఏళ్ల తర్వాత కాపిటల్ హిల్‌పై ఇలా నేరుగా దాడి జరగడం ఇదే తొలిసారికేపిటల్ భవనంపై తొలిసారి 1814లో దాడి జరిగింది. నిర్మాణం పూర్తయిన 14 సంవత్సరాలకు ఈ దాడి జరిగింది. నాడు జరిగిన యుద్ధంలో బ్రిటిష్ బలగాలు కేపిటల్ భవనంలోకి జొరబడి లూటీ చేశాయి. నిజానికి 1812లో జరిగిన యుద్ధంలో భాగంగా తొలిసారి దాడి జరిగింది. 1814లో బ్రిటీష్ సేనలు అప్పటికీ నిర్మాణంలో ఉన్న క్యాపిటల్‌పై దాడి చేశారు. వైస్ అడ్మిరల్ సర్ అలెగ్జాండర్ కాక్బర్న్, మేజర్ జనరల్ రాబర్డ్ రాస్ నేతృత్వంలోని బ్రిటీష్ సేనలు కాపిటల్ హిల్‌కు నిప్పు పెట్టారు.
ఈ హింసను ప్ ఖండించిన మాజీ అధ్యక్షులు..
అమెరికా నలుగురు మాజీ అధ్యక్షులు కూడా క్యాపిటల్ భవనం వద్ద జరిగిన ఘటనను ఖండించారు. ఈ హింసాత్మక ఘటన చరిత్రలో చేదు అనుభవంగా మిగిలిపోనుందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ట్రంప్ ఓటమి చెందారన్న నిజాన్ని ఆయన మద్దతుదారులకు వివరించి చెప్పటంలో అధ్యక్షుడు విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. మాజీ అధ్యక్షులైన బిల్‌క్లింటన్, జార్జ్ డబ్ల్యూ.బుష్, జిమ్మీ కార్టర్ కూడా కాపిటల్ భవనం వద్ద జరిగిన హింసను ఖండించారు.
ఇక అమెరికాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై యావత్ ప్రపంచం స్పందిస్తోంది..
విరోధులలో, చైనా హింసను హాంకాంగ్‌లో నిరసనలతో పోల్చింది, ఇప్పటికే అమెరికాపై కసి తీర్చుకోడానికి గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న డ్రాగన్ దేశం క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి రూపంలో ఆ అవకాశం రానేవచ్చింది. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న శత్రువుకి అవకాశం వస్తే వదులుకుంటుందా…? మరి చైనా కూడా అలాగే స్పందించింది. క్యాపిటల్ బిల్డింగ్‌లోని దృశ్యాలకు చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లువెత్తాయి. ఇది అద్భుత దృశ్యం అనే వ్యాఖ్య వైరల్ అవుతోంది. అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ దృశ్యాలను ఒకప్పుడు హాంగ్‌కాంగ్‌లో జరిగిన నిరసనలతో పోల్చుతూ సెటెర్లు వేసింది.
రష్యా పాశ్చాత్య ప్రజాస్వామ్యం యొక్క బలహీనతను చూపిస్తోందని, ఇరాన్ ట్రంప్‌ను ప్రపంచ భద్రతకు చెక్ చేయని ముప్పుగా పేర్కొంది. అమెరికా మిత్రదేశాలు ఈ దాడిని, ట్రంప్‌ను ఖండించాయి, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ‘‘చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడానికి అనుమతించలేము, అని స్పందించారు. మరోవైపు, ట్రంప్ యంత్రాంగంలో ఒక్కొక్కరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు మాట్ పొటింజర్, మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రాషిమ్, వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సారాహ్ మాథ్యూస్ తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఎట్టకేలకు ట్రంప్‌కి ఝలక్ ఇచ్చి.. అమెరికా ఎలక్టోరల్ కాలేజీ సంచలన నిర్ణయం తీసుకుంది, జో బైడెన్ గెలుపును అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. వైస్-ప్రెసిడెంట్‌గా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను కాంగ్రెస్ ఖరారు చేసింది.

M.A (B.Ed,) SET
ఉస్మానియా యూనివర్సిటీ
9666238266