Take a fresh look at your lifestyle.

‌ప్రపంచానికి తెలిసిన భారత్‌ ‌సత్తా

  • కొరోనాపై భారత్‌ ‌పోరు స్ఫూర్తిదాయకం
  • ఏడాదిలోపే 150 కోట్ల టీకా డోసుల పంపిణీ
  • వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్‌
  • ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌ప్రసంగం

కొరోనా మహమ్మారిపై భారత్‌ ‌పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ అన్నారు. ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే 150 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎక్కువ డోసులు అందించిన దేశా జాబితాలో భారత్‌ అ‌గ్రస్థానంలో ఉందని వివరించారు. కొరోనా మహమ్మారిపై భారత్‌ ‌పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలను ప్రారంభించి ప్రసంగించిన ఆయన.. కోవిడ్‌ ‌సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్యులు, శాస్త్రవేత్తలు, హెల్త్ ‌కేర్‌ ‌వర్కర్లు కలిసికట్టుగా పనిచేశారని కొనియాడారు. పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాలు సోమవారం ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్లో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రతి భారతీయుడికి ఆయన స్వాతంత్య అమృతోత్సవ్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి •దాలో రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కి ఇది చివరి ప్రసంగం కావడం విశేషం.

కొరోనా వ్యాక్సినేషన్‌ ‌సమయంలో భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పేర్కొన్నారు. జన్‌ధన్‌ ‌ఖాతాలు ఆధార్‌- ‌మొబైల్‌ ‌నెంబర్‌ అనుసంధానించి దేశ పౌరుల సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ ద్వారా 44 కోట్ల మంది పౌరులు కొరోనా సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలను పొందారని తెలిపారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌కార్డులు పేదలకు ప్రయోజనం కలిగించాయి. జన ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే పేదలకు ఔషధాలు పంపిణీ చేయడం ఆహ్వానించదగినది. కొరోనా సమయంలో పేదలు ఆకలితో ఉండ కుండా ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పథకాన్ని ప్రవేశపెట్టి.. ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ ‌పంపిణీ చేసింది. 2022 మార్చి వరకు దీన్ని పొడిగించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకం అని రాష్ట్రపతి చెప్పారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది రిపబ్లిక్‌ ‌డే ఉత్సవాలను జనవరి 23నే ప్రారంభించిన విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు.

గతాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ భవిష్యత్‌ను తీర్చి దిద్దడాన్ని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు. అంబేడ్కర్‌ ఆదర్శాలను తమ ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలుగా భావిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్య సేవలు అందిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌తెలిపారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పెట్టుబడులు పేదలకు చికిత్సలో సహాయం చేశాయని ప్రశంసించారు. డిజటల్‌ ఇం‌డియాకు యుపిఐ విజయవంతమైన ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు. డిజిటల్‌ ‌చెల్లింపులు అంగీకరిస్తున్నారనేందుకు గొప్ప ఉదాహరణ అని అన్నారు. కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లకు అభినందనలు తెలిపారు. కరోనాపై పోరాటంలో పౌరుల ప్రయత్నాలకు అభినందనలు తెలియజేశారు. ఏడాదిలోపే 150 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించిన రికార్డును అధిగమిం చామని అన్నారు. అంబేడ్కర్‌ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా ప్రభుత్వం పరిగిణిస్తుందని ప్రశంసించారు. యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతుందని ప్రశంసించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌ ‌మూల సూత్రంతోనే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నామని, దేశ సురక్షిత భవిష్యత్‌ ‌కోసం గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ముఖ్యమన్నారు.

గత స్మ•తుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని కొనియాడారు. వచ్చే 25 ఏళ్ల పాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, కోట్లమంది ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌కార్డులు అందుకున్నారన్నారు. పేద ప్రజలకు గూడు(ఆవాసం) కల్పించే హక్కును సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే సంకల్పంతో ముందకు వెళ్తుందని అన్నారు. హర్‌ ‌ఘర్‌ ‌జల్‌ ఇనేషియేటివ్‌ ‌కింద గ్రాణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఆరు కోట్లకు పైగా ట్యాప్‌ ‌వాటర్‌ ‌సౌకర్యం కల్పించిందని చెప్పారు. దేశంలోని రైతులందరికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి ప్రశంసించారు. కీలక విధానాల్లో రైతులు, చిన్నరైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుందని చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు. 2020-21 కోవిడ్‌ ‌మహమ్మారి సమయంలోనూ 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించారని, 33 కోట్ల హార్టీకల్చర్‌ ఉత్పత్తులు సాధించారని చెప్పారు. ప్రభుత్వం 433 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల గోదువులు సేకరించిందని, దీంతో 50 లక్షలతలు పెరిగాయని అన్నారు.

Leave a Reply