- వ్యాక్సిన్ రావాలంటే రెండేళ్లు ఆగాల్సిందే
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబారో
కోవిడ్ 19 చాలా ప్రమాదకరమైన వైరస్ అని ప్రజలు జాగ్రగత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబారో సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరోనా ఒకసారి తగ్గినా మళ్ళీ రాదని గ్యారెంటీ లేదన్నారు. కాబట్టి ప్రజలే తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యకర అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. వైరస్ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. వైరస్ నుండి ప్రజలను రక్షించేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో పడ్డారు.
అంతే కాకుండా త్వరలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని పలు దేశాలు ప్రకటించాయి. నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబారో సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రపంచ జనాభాకు సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరో రెండేళ్లు పడుతుందన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న దేశాలకు అందించాలని అన్నారు. ఇప్పటివరకు ఏ దేశంలోనూ కొరోనాకు చికిత్స లేదని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఏదైనా దేశం చికిత్స ఉందంటే తమకు తెలిపాలని అన్నారు.