“దేశంలో పుట్టిన ప్రతి శిశువు ఆరోగ్యంగా ఎదిగి, సమర్థ మానవ వనరుగా రూపుదిద్దుకునేందుకు సమతుల ఆహారం అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొరోనా ధాటికి కోట్లాదిమంది బతుకులు అగమ్యగోచరంగా మారి అల్లాడిపోతున్నారు.”
ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16న ఆహార వ్యవసాయ సంస్థను ప్రారంభి ంచ డానికి గుర్తుగా ప్రతి సంవ త్సరం అక్టోబర్ 16 వ తేదీన ప్రపంచ ఆహార దినోత్స వంని ర్వ హిస్తారు. ప్రపం చంలో ఆకలి నిర్మూ లనకు కృషి చేయడం ఈ రోజు ముఖ్యాంశం. అన్నార్తుల ఆకలిని తీరుస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి బాధ అనుభవిస్తున్న కోట్లాది వైపు నోబెల్ కమిటీ దృష్టి సారించినట్లయింది.
విశ్వవ్యాప్తంగా తాండవం చేస్తూ కొరోనా ప్రజల ఆకలి బాధను మరింత పెంచిన నేపథ్యంలో గత ఏడాది 88 దేశాల్లో 100 మిలియన్ల మంది ఆకలి తీర్చిన ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రస్తుతం ఈ సమస్యపై దృష్టి సారిం చింది.ప్రపంచ జనాభాలో 11.3 శాతం మంది ఆకలి బాధితులే. కొరోనా ప్రపంచ ఆహార ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా ఆహార సంక్షోభాన్ని తీవ్ర స్థాయిలో పెంచింది. 23 పైగా దేశాలు ఇప్పటికే తీవ్రమైన ఆహార సంక్షోభంలో చిక్కుకున్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్, జింబాబ్వే, జాంబియా, చైనా, దక్షిణ కొరియాల్లో ఆహార కొరత తీవ్రంగా ఉంది. కొరోనా ప్రభావం వలన కోట్లాది మందికి దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఐక్యరాజ్యసమితి ముఖ్య ఆర్థికవేత్త ఆరిఫ్ హుస్సేన్ హెచ్చరించారు. ఆహారపదార్థాలను పొదుపుగా వాడుకోవాలని ‘‘క్లీన్ యువర్ ప్లేట్’’ పేరిట ఇప్పటికే చైనా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. కోవిడ్ వలన ఆకలి చావులు రెట్టింపు కానున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నది. చాలా దేశాల్లో ప్రజలు ఆహార పొట్లాల కోసం గంటల తరబడి బారులు తీరడం తెలుసు. చివరకు అమెరికా ఫీనిక్స్ నగరం లో కూడా జనం ఆహార పదార్థాల కోసం గంటల తరబడిన విషయం అందరూ చూసారు.
2017 జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం మన దేశంలో 19 కోట్ల మంది ప్రజలు రోజూ ఆకలితో అలమటిస్తుండగా, దాదాపు మూడు లక్షల మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారు. అదేమాదిరి దాదాపు 51 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీ 2019 ప్రకారం 117 దేశాల్లో మన దేశం 102 వ స్థానంలో ఉంది. 2025 నాటికి ప్రపంచ పోషకాహార లక్ష్యాల సాధనలో విఫలమయ్యే 88 దేశాల్లో భారత్ కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020లో వెల్లడించారు. దేశంలో పుట్టిన ప్రతి శిశువు ఆరోగ్యంగా ఎదిగి, సమర్థ మానవ వనరుగా రూపుదిద్దుకునేందుకు సమతుల ఆహారం అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొరోనా ధాటికి కోట్లాదిమంది బతుకులు అగమ్యగోచరంగా మారి అల్లాడిపోతున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి రాని వలస కార్మికులకు 5 కిలోల ఆహార ధాన్యాలను కేంద్రం సరఫరా చేసింది. వ్యవసాయ రంగం పాలకులలో ధీమా పెంచినప్పటికీ, తిండి గింజలు కొనలేని పరిస్థితిలో పేద కుటుం బాలున్నాయి. దేశవ్యాప్తంగా ఐదు లక్షల రేషన్ దుకాణాలకు ఏడాది పాటు ఆహార ధాన్యాలు సరఫరాకు అవసరమైన నిల్వలు గోదాముల్లో ఉన్నాయి. కఓనాతో బాధపడ్డ పేదలు కూడా సాధారణ జీవితం గడిపే పరిస్థితి వచ్చే వరకు అందరికీ ఉచితంగా రేషన్ సమకూర్చే బాధ్యత ప్రభుత్వాలు వహించాలి.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ, 6 నుండి 14 సంవత్సరాల వయస్సు బాల బాలికలకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వయస్సు పిల్లలకు పౌష్టికాహారం, మాతా శిశు సమగ్ర అభివృద్ధి పథకం కింద గర్భవతులకు, బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లుల సంరక్షణ పథకాలు లబ్ధిదారులకు చేరగలిగితే ధన్యులం. తరగతి గది పర్యవేక్షకులు ఉన్నట్లుగానే పోషకాహార పర్యవేక్షకులు ఉండాలని, బడిలో ప్రోగ్రెస్ కార్డు మాదిరిగా న్యూట్రిషన్ రిపోర్ట్ కార్డు ను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాని ఇటీవల పేర్కొన్నారు. ఇది ఆచరణలోకి వస్తే పిల్లల ఆరోగ్య సంరక్షణలో ముందడుగు వేసినట్లే.. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో అర్హులందరికీ పౌష్టికాహారం అందిం చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకో గలిగితే మనం విజయం సాధించినట్లే. ప్రభుత్వాలు ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయ గలిగితే, వృధా అవుతున్న ఆహార పంటలను, ఆహార పదార్థాలను మనం కాపాడుకోగలిగితే ఆహార కొరతే ఉండదు.
