Take a fresh look at your lifestyle.

కొరోనాతో ప్రపంచ ఆర్థకరంగం కుదేలు

  • రానున్న రోజుల్లో మరింత దారుణంగా పరిస్థితులు
  • మొదటి స్థానంలో పర్యాటక,విమానయానం 
  • రెండవ స్థానంలో మీడియా ..దవాఖానాల్లో సైతం పడిపోయిన రోగుల సంఖ్య 

కొరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. కొరోనా మహమ్మారి కంటే రానున్న ఆర్థిక మాంద్యం మానవాళిపై మరింత తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇతర దేశాలపై ఆధారపడకుండా ఏ దేశం కూడా మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. కలరా, ప్లేగు వంటి మహమ్మారులు విజృంభించినప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఎవరి బతుకు వారిది. ఇప్పుడు ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతే ఉత్పన్నమయ్యే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. కేవలం మూడు వారాల లాక్‌డౌన్‌కే వివిధ రంగాలు, కంపెనీల ఆర్థిక పరిస్థితి తలకిందులు అవుతోంది.కరోనా ప్రభావం పడని రంగం,దేశం అంటూ ఏదీ మిగలకుండా పోయింది. అతిశయోక్తి కాదు. దవాఖానా ల సైతం రోగుల సంఖ్య 70 శాతం వరకూ పడిపోయిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. మొదటగా కుదేలైనవి విమానయాన, పర్యాటక రంగాలు కాగా, రెండవ స్థానంలో డియా ఉంది. లాక్‌డౌన్‌ ‌పర్యవసానం వల్ల వివిధ రంగాలలో కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. ప్రభుత్వాలు ఎన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా తాత్కాలిక ప్రత్యామ్నాయాలు మాత్రమే అని గుర్తించాలి. ఉత్పత్తి, కొనుగోలు నిలిచిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా గణనీయంగా పడిపోతోంది. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

- Advertisement -

దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను నిషేధించడంతో విమానయాన రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోతారు. పర్యాటకుల రాక నిలిచిపోవడంతో •టళ్లు మూతపడబోతున్నాయి.రైతుల సమస్యలను పరిష్కరించడానికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగని పక్షంలో మున్ముందు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారి మరో నెల రోజుల్లో అదుపులోకి రాకపోతే ఖరీఫ్‌ ‌సీజన్‌లో పంటలు కూడా వేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అదే జరిగితే తిండి గింజలకు కూడా అలమటించాల్సి వస్తుంది. పంటలన్నీ కోతలకు వచ్చాయి. వైరస్‌ ‌సోకుతుందన్న భయంతో కూలీలు కోతలకు ముందుకు రావడం లేదు. పంటలు కోయడానికి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస కూలీలు వస్తుంటారు. తెలుగు రాష్టాల్ల్రో కూడా ఒక జిల్లా వారు ఇంకో జిల్లాకు వలస వెళుతుంటారు. అయితే లాక్‌డౌన్‌ ‌కారణంగా కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో పండిన పంటలను ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. పండ్ల తోటల రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పండ్ల తోటల రైతులు తమ పంటను హైదరాబాద్‌, ‌బెంగళూరు లకు తరలి స్తుంటారు. అయితే లాక్‌డౌన్‌ ‌కారణంగా •ల్‌సేల్‌ ‌వ్యాపార మార్కెట్లు మూతబడ్డాయి. దీంతో కషన్‌ ఏజెంట్లు తోటల వద్ద పండ్లు కొనడానికి ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌ ‌కారణంగా పండ్ల వినియోగం కూడా తగ్గిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడ రహదారులపై నిలిచిపోయాయి. పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ ‌వల్ల ఉత్పన్న మవుతున్న ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవలసిన అవసరముంది. అన్ని రంగాలు కుదేలవ్వడం వల్ల దాని ప్రభావం ఐటీ రంగంపై కూడా పడుతుంది. అదే జరిగితే దేశంలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న జీఎస్‌టీ రాబడి పడిపోతున్నది. వివిధ సంస్థలు ప్రకటించిన అంచనాల ప్రకారం దాదాపు ఐదు కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. నిర్మాణ రంగంపై కరోనా ప్రభావం ఇప్పటికే పడింది. హైదరాబాద్‌ ‌వంటి మహా నగరాల్లోనే అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. దీంతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడే ప్రమాదం పొంచి ఉంది. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పరిస్థితి భయంకరంగా మారబోతోంది. ఈ ఆర్థిక విపత్తుని ఎదుర్కోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పెను సవాలే కానుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను వీలైనంత త్వరగా తరిమి కొట్టడమే మానవాళి ముందు ప్రస్తుతం ఉన్న ఏకైక కర్తవ్యం. ప్రజలలో ప్రాణభీతి తొలగిపోనంత వరకు పరిస్థితులు కుదుటపడవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలు ఎక్కాలంటే ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. అభివృద్ధి పేరిట ప్రపంచీకరణ మోజులో పడిపోయిన మిగతా దేశాలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి. ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ ‌కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అయితే కనీసం ఏడాదైనా పడుతుందని అంటున్నారు ..

Leave a Reply