Take a fresh look at your lifestyle.

ఆకాశంలో జాబిలి!

జాబిల్లి ఎప్పుడూ ఆకాశంలోనే
ఉంటుంది!
పున్నమి నాడు పరవశం చెంది
వెన్నెల పూలు జల్లి పలకరిస్తే!
అమావాస్యకు అలగి చీకటితెర
కప్పుకొని కలవరపెడుతుంది!
వెన్నెల కాసిననాడు గగనమంతా
కాగడా వెలుతురులా పరిస్తే!
చీకటి దుప్పటీలో గుడ్డి నక్షత్రాల
కాంతి ధూపపు వత్తిలా ఉంటుంది!
నిత్య పౌర్ణమిలు నాకూ వద్దు
అమాసరేత్రి లేకుండా ఉంటే చాలు!
వన్నెల వెలుగు నిత్యం లేకపోయినా
నవ్వుల నెలవంక దర్శనమే పదివేలు!
ఇంతకూ
ఆ జాబిల్లి నువ్వే!
ఆ ఆకాశం నా మనసే!
– ఉషారం, 9553875577

Leave a Reply