Take a fresh look at your lifestyle.

కొరోనాకు ప్రపంచ స్థాయి వైద్యం

అంతటా ఒకే విధానం ఉండాలి డాక్టర్లతో మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్

‌ప్రపంచ వ్యాప్తంగా కొరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
‌తెలిపారు. ఇన్ఫెక్షన్‌ ‌డిసీజ్‌లో నైపుణ్యం గల డాక్టర్స్‌తో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్ల సూపరింటెండెంట్‌, ‌చికిత్స అందిస్తున్న డాక్టర్స్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…కొరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని స్పష్టం చేశారు. వైరస్‌ ‌వచ్చిన వారు జబ్బుతో కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారన్నారు.

పాజిటివ్‌ ‌పేషెంట్లలో ధైర్యం నింపాలని సూచించారు. యాంటీ వైరల్‌ ‌మందులకంటే స్టెరాయిడ్‌ ‌మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయన్నారు. సీటీ స్కాన్‌ ‌వల్ల ప్రయోజనం లేదని… ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ‌విజయ్‌ ఎల్దంది, హైదరాబాద్‌కు చెందిన డా.ఎంవీ రావు, డాక్టర్‌ ‌సునీత, చెస్ట్ ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌మహబూబ్‌ ‌ఖాన్‌, ‌ఫీవర్‌ ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌శంకర్‌, ‌నిమ్స్ ‌వైద్యులు గంగాధర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!